Sunday, September 20, 2026
HomeLATESTChiranjeevi:హైదరాబాదులో వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్ ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!

Chiranjeevi:హైదరాబాదులో వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్ ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఏషియన్ సంస్థతో చేతులు కలిపినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

on
- Advertisement -banner Ad

Chiranjeevi:ఇండియన్ సినీ పరిశ్రమలో హైదరాబాద్ నగరానికి ఉన్న స్థానం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు కేవలం ప్రాంతీయ సినిమా కేంద్రంగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు విశ్వవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేలా మారింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం సిటీ రామోజీ నుంచి సరికొత్త టెక్నాలజీలతో కూడిన అత్యాధునిక పోస్ట్ ప్రొడక్షన్స్ స్టూడియోలు అత్యధిక థియేటర్లు, సినీ ప్రేక్షకుల అసాధారణ ఆదరణ వరకు హైదరాబాద్ సినీ రంగానికి కొండంత అండగా నిలుస్తోందని చెప్పవచ్చు. ఎక్కడ ఎలాంటి పెద్ద సినిమా విడుదలైనా సరే హైదరాబాద్లో కలెక్షన్స్ సునామీకి మూల కేంద్రంగా మారింది.

హైదరాబాదులో వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్..

అలాంటి హైదరాబాదులో ఇప్పుడు అంతర్జాతీయంగా సరికొత్త చరిత్రను సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అత్యధిక మల్టీప్లెక్స్ లను తీర్చిదిద్దిన ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఇప్పుడు మెగాస్టార్ తో కలిసి ఒక సరికొత్త ట్రెండ్ సృష్టించబోతున్నట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది. ప్రముఖ నగరంలో ఒక అల్ట్రా – ప్రీమియం మల్టీప్లెక్స్ ప్రాజెక్టుని మొదలు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం విలాసవంతమైన థియేటర్ మాత్రమే కాకుండా వరల్డ్ లార్జెస్ట్ సినిమా స్క్రీన్ గా ఆవిష్కరించేలా ప్లాన్ చేస్తున్నారట.

- Advertisement -
Advertisement

ALSO READ:Shruti Haasan:సమంత మిస్‌ చేసుకున్న ఆఫర్‌ శ్రుతిహాసన్‌కు.. బిగ్‌ ఇంటర్నేషనల్‌ సినిమా ఇది..!

ప్రపంచ రికార్డులు తిరగరాయనున్నారా?

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే భారీ స్క్రీన్ల చరిత్ర కలిగి ఉన్న థియేటర్లో ఉన్నాయి . అలా ఆంధ్రప్రదేశ్ లోని సూళ్లూరుపేటలో నిర్మించిన వి ఎపిక్ మల్టీప్లెక్స్ థియేటర్ ఇండియాలోనే కాకుండా ఆసియాలోని అతిపెద్ద స్క్రీన్ గా పేరు సంపాదించింది. సుమారుగా 106 అడుగుల వెడల్పు 54 నుంచి 56 అడుగుల ఎత్తుతో 676 సీట్ల సామర్థ్యంతో కలదు. ఈ థియేటర్ ని 2019 ఆగస్టులో రామ్ చరణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇందులో సినిమాలు చూడడానికి చాలామంది ప్రేక్షకులు మక్కువ చూపుతున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాదులో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) భాగస్వామితో ఏషియన్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT:థియేటర్లలో హిట్.. ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘మోద రాత్రి’!

అతి పెద్ద స్క్రీన్..

ఒకవేళ ఈ ప్రాజెక్టు ఓకే అయితే కనుక ఆసియా రికార్డులను మాత్రమే కాకుండా గ్లోబల్ రికార్డులను తిరగరాసేలా కనిపిస్తోంది.. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పెద్ద స్క్రీన్ల విషయానికి వస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ జర్మనీలో కలదు.. ఇది సుమారుగా 127 అడుగుల వెడల్పు 69 అడుగుల ఎత్తులో ఉన్నది. డ్యూయల్ లేజర్ ప్రాజెక్టు కలదు. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ గా గిన్నిస్ బుక్ రికార్డును సైతం సంపాదించుకుంది. ఇక అమెరికాలో జార్జియా లో రాయలసీమ ధియేటర్ 101 అడుగుల వెడల్పు 76.2 అడుగుల ఎత్తున కలదు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్క్రీన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఈ రికార్డులను సైతం బ్రేక్ చేసేందుకు హైదరాబాదులో ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you