Bigg Boss 10:బిగ్ బాస్ తెలుగు పదవ సీజన్ ఇప్పుడు రెండోవారం జరుగుతుంది. ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయినట్లుగా సమాచారం. మొదటి వారంలో చరణ్, చైత్ర ఎలిమినేషన్ అవ్వగా , ఈ వారంలో నటుడు కృష్ణుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్(Bigg Boss 10) లోకి అడుగుపెట్టినప్పటి నుంచి కృష్ణుడు చాలా కూల్ గా చిల్ అవుతూ కనిపించారు. కానీ షోలో తనని తాను నిరూపించుకోవడానికి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
సత్తా చాటని కృష్ణుడు..
మొదటి వారంలో అక్కడక్కడ కనిపించినా ..రెండవ వారంలో ఆటలో మాటల్లో ఎక్కడా కూడా పెద్దగా తన ఇంపాక్ట్ కనిపించలేదు. ఫిజికల్ టాస్కులలో కూడా ఇబ్బంది పడుతూ షోకే కాకుండా వెకేషన్ కి వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని పలువురు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ఇటీవలే జరిగిన గార్డ్ టాస్కులు హౌస్ మేట్స్ అందరూ పోటీ పడుతూ ఉంటే కృష్ణుడు మాత్రం విజిల్స్ వేస్తూ చుట్టూ తిరగడం జరిగింది. దీంతో మొదటి రౌండులో వంశీ రోహిత్ లో ఆయనని పక్కన పెట్టేశారు. వీకెండ్ ఎపిసోడ్ లో కూడా హోస్ట్ నాగార్జున కృష్ణుడు, సృష్టిల పైన ఫైర్ అయ్యారు.
ALSO READ:Chiranjeevi:హైదరాబాదులో వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్ ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!
నాగార్జున ఫైర్..
ముఖ్యంగా ఇంట్లో ఏమీ చేయకుండా ప్రేక్షక పాత్ర పోషించకుండా వారిద్దరు దూరంగా మూలన కూర్చున్నారని ఈ వారం నామినేషన్ లో ఉన్న 11 మందిలో ముఖేష్ గౌడ, రోహిత్ ఓటింగ్‌లో టాప్ లో దూసుకెల్లగా కృష్ణుడు, సృష్టి, సుధీర్ చాలా లీస్ట్ స్థానాలలో నిలిచారు. అయితే ఆన్లైన్ పోల్స్ లో కృష్ణుడుకి కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఆయన ఆట వల్ల హౌస్ కి ఎలాంటి లాభాలు లేదని భావించిన ఆడియన్స్ ఆయనకు ఓటు వేయడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. దీంతో అనధికారికంగా రెండో వారంలో అందరికంటే తక్కువ ఓటింగ్ సాధించిన కృష్ణుడే ఈసారి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ALSO READ:Shruti Haasan:సమంత మిస్ చేసుకున్న ఆఫర్ శ్రుతిహాసన్‌కు.. బిగ్ ఇంటర్నేషనల్ సినిమా ఇది..!
ఎలిమినేషన్ తప్పదా?
ఇందుకు సంబంధించి అధికారికంగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు నటుడుగా తన నటనతో ఆకట్టుకున్న కృష్ణుడు ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలలో కనిపించలేదు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని తెలిసి కచ్చితంగా ఈసారి తన ఇన్ఫాక్ట్ చూపిస్తారని అందరూ భావించారు. కానీ హౌస్ లోకి వచ్చిన తర్వాత అలాంటిదే కనిపించకపోవడంతో అభిమానులు కూడా నిరాశతో ఉన్నారు. మరి అందరూ అనుకున్నట్టుగానే ఈసారి రెండవ వారం ఎలిమినేషన్ కృష్ణుడు అవుతారో లేదో చూడాలి.




