Nani:నేచురల్ స్టార్ నాని తన అభిమానులపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. తనను అభిమానించే వారిని కలుసుకునేందుకు ఆయన ప్రత్యేకంగా భారీ ఫ్యాన్ మీట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ సారథి స్టూడియోస్‌లో ఈ కార్యక్రమం కోసం ఏకంగా ఓ ఫ్లోర్‌ను పూర్తిగా బుక్ చేసినట్లు తెలుస్తోంది.
అభిమానులతో నాని సందడి :
నానిని ప్రత్యక్షంగా కలుసుకోవాలనే కోరికతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ ఫ్యాన్ మీట్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా నాని ఎంతో ఓపికగా అభిమానులను కలుసుకుంటూ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ఒక్కొక్కరితో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ వారిని సంతోషపెట్టారు. అభిమానుల ఉత్సాహాన్ని చూసి నాని కూడా ఎంతో ఆనందంగా కనిపించారు.
10 వేల మందికి భోజనం :
తనను కలుసుకోవడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు ఎలాంటి ఇబ్బంది పడకూడదని నాని (Nani)ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. ముఖ్యంగా ఫ్యాన్స్ ఆకలితో తిరిగి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఏకంగా 10 వేల మందికి భోజనాలు సిద్ధం చేయించినట్లు సమాచారం. ఈ ఫ్యాన్ మీట్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానుల పట్ల నాని చూపించిన ఆప్యాయతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
నాని కోసం ప్రత్యేకంగా గిఫ్ట్ తీసుకొచ్చిన లేడీ ఫ్యాన్ :
హీరో నానిని కలుసుకోవడానికి దాదాపు పదివేల మంది అభిమానులు వచ్చారు. వాళ్లలో చాలామంది నాని కోసం నానికి ఇష్టమైనవి కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా ఒక లేడీ అభిమాని నాని కోసం ఎంతో ప్రేమగా, ఇష్టంగా ఒక షర్ట్ తీసుకొచ్చింది. అంతేకాదు, నాని ‘ది పారడైజ్’ సినిమా హిట్ అవుతుందని, సక్సెస్ మీట్లో కచ్చితంగా ఈ షర్ట్ వేసుకోవాలని చెప్పినట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
also read:Nani:స్టేజ్ పై నానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన లేడీ అభిమాని..!
అభిమాని గిఫ్ట్ చూసి మురిసిపోయిన నాని:
నాని ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా అభిమానులను దగ్గరకు తీసుకున్నారు. గిఫ్ట్ చూసి మురిసిపోయి థాంక్యూ చెప్పి మరీ అభిమానితో స్పెషల్ సెల్ఫీ దిగారు. అంతేకాదు, చేతులతో లవ్ సింబల్ పెట్టి అభిమాని కోరిక కూడా తీర్చారు. నాని అభిమానుల కోసం ఏమైనా చేస్తారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని అభిమానులు చెబుతున్నారు.
also read:Varanasi:వారణాసి సినిమాలో ఇంటర్వెల్ సీన్స్ ఇలా ఉండనుందా. ?
‘ది పారడైజ్’పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు:
నాని కచ్చితంగా ‘ది పారడైజ్’ సినిమాతో వేరే లెవెల్ హిట్ అందుకుని, ఆ రేంజ్ దాటిపోయేంత హీరో అవుతారని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.కాగా, ‘ది పారడైజ్’ సినిమాను శ్రీకాంత్ ఓదెల తనదైన స్టైల్లో డైరెక్టర్ చేశారు. ఈ సినిమాలో నాని “జడల్” అనే క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం నాని తన కెరీర్లో ఏ సినిమాకీ చేయనటువంటి రిస్కులు కూడా చేశారు.
వైలెన్స్‌కు మరో లెవెల్లో ఉండబోతున్న సినిమా :
మరీ ముఖ్యంగా వైలెన్స్‌కు వైలెన్స్ అనే రేంజ్లో ఈ సినిమా ఉండబోతుంది అంటూ మేకర్స్ నుంచి కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా నాని కెరీర్లోనే ప్రత్యేకంగా నిలుస్తుంది అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram




