Vijay Deverakonda:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించిన జంటలలో రష్మిక, విజయ్ దేవరకొండ జంట కూడా ఒకటి. 2026 ఫిబ్రవరిలో ప్రేమించి వివాహం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని వెల్లడిస్తూ ఉంటారు. అలా ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా విరోష్ జోడి మరొకసారి తన ప్రేమ బంధాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం రష్మిక, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కలిసి రణబాలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రణబాలి నుండి ఆకట్టుకుంటున్న ఏందయ్యా సామి..
వివాహమనంతరం రష్మిక, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం చేత అభిమానులు కూడా ఈ సినిమా పైన భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో భార్యాభర్తలుగా నటిస్తున్నారు. సింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. జయమ్మ పాత్రలో రష్మిక కనిపించబోతోంది. ఇప్పటికే రిలీజైన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన ఏందయ్యా స్వామి అనే ఫస్ట్ సింగిల్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. 19వ శతాబ్దంలో పెళ్లి తర్వాత సందడి ఎంత సాంప్రదాయంగా ఉండేదో ఈ పాటలో చాలా అందంగా చూపించారు.
also read:The Paradise: ది ప్యారడైజ్ సినిమాలో ఆ సీన్స్ పై వివాదం..!
భర్తపై ప్రేమ ఒలకబోసిన రష్మిక..
రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉండనున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆ పాట వీడియో క్లిప్ ను రష్మిక తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటూ తన భర్త విజయ్ పైన ఉన్న తన ప్రేమను తెలిపింది.”అతడు పూర్తిగా నాకే సొంతమయ్యాడు . కానీ ఆయన పైన క్రష్ మాత్రం తగ్గలేదు.. అదే క్రేజ్” అంటూ రష్మిక పోస్ట్ చేశారు. ఈ విషయానికి విజయ్ దేవరకొండ తనదైన శైలిలో సమాధానమిస్తూ.. “నేను అదృష్టవంతుడిని.. జయమ్మును మిస్ అవుతాను.. కానీ నువ్వు మాత్రం జీవితాంతం నాతో ఉంటావు “అంటూ విజయ్ దేవరకొండ పోస్ట్ షేర్ చేశారు. దీంతో వీరి రియల్ లైఫ్ కు ఈ పాట సింక్ చేసి పెట్టి మరి అభిమానులు వైరల్ చేస్తున్నారు.
also read:Pragya Jaiswal: గ్రీన్ చుడీదార్ లో మెస్మరైజ్ చేసిన బాలయ్య హీరోయిన్!
అదృష్టవంతుడిని జయమ్మ అంటున్న విజయ్ దేవరకొండ..
రణబాలి చిత్రాన్ని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్లోనే నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది .ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 16వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. రష్మిక సినిమాల విషయానికి వస్తే.. మైసా అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సినిమా కూడా ఈ ఏడాది విడుదల చేయబోతోంది. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాని కూడా ఈ ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా రష్మిక, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న రణబాలి సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
రష్మిక–విజయ్ దేవరకొండ కెమిస్ట్రీకి సోషల్ మీడియాలో మరోసారి స్పార్క్ వచ్చింది. #Ranabaali మూవీ నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ క్లిప్ ను షేర్ చేస్తూ, “అతను పూర్తిగా నావాడే అయినా.. ఇప్పటికీ అతనిపై క్రష్ ఆగడం లేదు” అంటూ రష్మిక ఇన్స్టాగ్రాం స్టోరీలో పోస్ట్ చేస్తే, దానికి విజయ్… pic.twitter.com/kPUQnJ07vA
— Journalist Yagna (@yagnamurthy) September 24, 2026




