Srikanth odela:నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమా భారీ విజయాన్ని అందుకుంది . ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది. డైరెక్టర్ మీద ఉండే నమ్మకంతో నాని ఈ సినిమాకి అవకాశం కల్పించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, హీరో నాని మధ్య గొడవలు జరిగాయని , దీంతో దర్శకుడుని నాని కొట్టాడు, తిట్టాడు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
డైరెక్టర్ ను కొట్టిన నాని..
అంతేకాకుండా డైరెక్టర్ వల్లే అందులో నటించే కొంతమంది ఆర్టిస్టులు వెళ్లిపోతే హీరో నాని వారిని బతిమాలి మరి తీసుకువచ్చారని వార్తలు వినిపించాయి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా(Srikanth odela) సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువ టేక్స్ చేయించడం వల్లే సినిమా ఆలస్యం అయ్యిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ వ్యాఖ్యల పైన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తాజాగా నిర్వహించిన ది ప్యారడైజ్ సినిమా సక్సెస్ మీట్ లో స్పందించారు. శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. “నేను.. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని వార్తలను చదివాను. నాని అన్న నన్ను తిట్టాడు, తన్నాడు, మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయనే విషయాన్ని విన్నానని చెప్పారు.
also read:Film industry: పెళ్లయిన హీరోతో ఎఫైర్.. కెరియర్ నాశనం చేసుకున్న హీరోయిన్.
అవన్నీ మా ఇష్టం – డైరెక్టర్
అయితే ఈ సినిమా సమయంలో నేను కూడా అలిగాను, అరిచానని విన్నాను. అవన్నీ నిజాలే.. నేను అన్న వేరే సినిమాలు కూడా చేస్తానో లేదో తెలియదు కానీ మా ఎమోషన్ సినిమాలో పెట్టలేను. సినిమా ఎమోషన్ వేరు.. మా ఇద్దరి ఎమోషన్ వేరు.. ఆయన నన్ను భరించాల్సిందే.. మోయాల్సిందే ..సమస్య లేదు మేము ఇద్దరం తన్నుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం.. ఏడున్న మా ఇద్దరి మధ్య ఎమోషన్ అదే .. కొన్ని ఎమోషన్స్ బతుకు దగ్గర ఆగవు.. అది చావును దాటి చూడాలి అది నాని అన్నతో నా ఎమోషన్.. ఈ విషయంలో నాని అన్నకు థాంక్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ శ్రీకాంత్ ఓదెల తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అటు డైరెక్టర్ పైన ఇటు నాని పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.
also read:Dhanush:ధనుష్- వడివేలు మధ్య విభేదాలు?
టాక్ తో సంబంధం లేకుండా వరుస కలెక్షన్స్..
ది ప్యారడైజ్ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించగా, మోహన్ బాబు విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు. సినిమా విడుదలైనప్పటి నుంచి ట్రోల్స్ వినిపిస్తున్నప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. రెండవ రోజు ప్యారడైజ్ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 98.50 కోట్ల రూపాయలు రాబట్టింది. ప్రస్తుతం నాని బ్లడీ రొమిఒ అనే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయబోతున్నారు
I liked your honesty bro @odela_srikanth ❤️❤️
Sensible Speach 🫡✍️ #TheParadise pic.twitter.com/ZT4hkrFbi8
— Veeeraaa 🦅 (@Nayak_Pawanist) September 26, 2026




