Meenakshi Chaudhary:తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు, నేచురల్ స్టార్ హీరో నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన “ది పారడైజ్” సినిమా సోషల్ మీడియాలో దారుణమైన నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా పై ఎలాంటి రివ్యూస్ వినిపించాయో అందరికి తెలిసిందే. నాని ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. కొంతమంది కావాలని పని కట్టుకుని నాని పారడైజ్‌పై లేనిపోని ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివాదం సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూనే ఉంటున్నాం.
తప్పులను ఒప్పుకున్న నాని.. :
అయితే నేచురల్ స్టార్ నాని మాత్రం కూల్‌గా తన సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్‌ను మొత్తం పాజిటివ్‌గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. “మా తప్పులు మేము తెలుసుకున్నాం. నెక్స్ట్ సినిమాకి ఆ తప్పులు రాకుండా చూసుకుంటాం” అంటూ ఓపెన్‌గానే స్పందించారు. ఇలాంటి మూమెంట్లోనే నాని పేరు సోషల్ మీడియాలో హైలెట్‌గా మారింది.
సుజిత్‌తో నాని నెక్స్ట్ మూవీ..:
నాని తన తరువాతి సినిమాని ఓజీ దర్శకుడు సుజిత్ కాంబోలో ఫిక్స్ అయిన విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌కు బ్లడీ రొమియో అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. టైటిల్‌తోనే ఇది ఎలాంటి లవ్ ట్రాక్ సినిమా అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో హీట్ పెంచేస్తుంది.
also read:Samantha:ప్రెగ్నెన్సీలో సమంత క్యూట్ మూమెంట్స్.. భర్తతో కలిసి ఏం చేసిందంటే?
నానికి జోడిగా మీనాక్షి చౌదరి? :
ఈ సినిమాలో నానికి జోడిగా చాలామంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. సాయి పల్లవి, పూజా హెగ్డే, రుక్మిణి వసంత్ ఇలా ఎంతోమంది టాప్ మోస్ట్ హీరోయిన్ల పేర్లు ట్రెండ్ అయ్యాయి. ఫైనల్లీ చిత్ర బృందం మాత్రం గోల్డెన్ బ్యూటీ మీనాక్షి చౌదరినే కథానాయికగా ఎంపిక చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.
ఆల్రెడీ సినిమా కథను మీనాక్షి చౌదరికి వినిపించారట. ఆమె ఓకే చేసిందట. దీనిపై త్వరలోనే చిత్ర బృందం అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
also read:Faria Abdullah:ఫరీయ అబ్దుల్లా జీవితంలో అల్లు అర్జున్‌కు ఇంత స్పెషల్ ప్లేస్ ఉందా?
రేర్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు.. :
నేచురల్ స్టార్ నాని, గోల్డెన్ బ్యూటీ మీనాక్షి చౌదరి వెరీ రేర్ కాంబో. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. పైగా రొమాంటిక్ సినిమా అంటే కచ్చితంగా యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. నేచురల్ స్టార్ నాని రొమాంటిక్ సినిమాలో అంటే ఇక చెప్పనవసరం లేదు. కచ్చితంగా సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.
బ్లడీ రొమియోతో పాజిటివిటీ వస్తుందా?:
ది పారడైజ్ సినిమాతో మూట కట్టుకున్న నెగిటివ్ మొత్తం ఈ బ్లడీ రొమియో సినిమాతో పాజిటివిటీగా మారిపోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి, ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ను మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ఎప్పుడు ప్రకటిస్తారనేది.
#TCExclusive – #BloodyRomeo !!
Actress Meenakshi Chaudhary is in talks to star opposite Natural Star #Nani in his upcoming film #BloodyRomeo.
An Action Gangster Drama with Dark Humor.
Directed by Sujeeth. Produced by Niharika Entertainments and Unanimous Productions.… pic.twitter.com/cseZmcdgzk
— Telugu Chitraalu (@CineChitraalu) September 28, 2026




