Wednesday, September 30, 2026
HomeLATESTDevara 2: దేవర 2 అసలు ఉంటుందా? లేదా? క్లారిటీ ఇచ్చేది ఎవరు..?

Devara 2: దేవర 2 అసలు ఉంటుందా? లేదా? క్లారిటీ ఇచ్చేది ఎవరు..?

Devara 2: దేవర 2 సినిమా ఉంటుందా లేదా అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

on
- Advertisement -banner Ad

Devara 2: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన చిత్రం దేవర. 2024లో విడుదలైన ఈ చిత్రం డివైడర్ టాక్ వచ్చినప్పటికీ, 500 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టింది. ఆ సమయంలో దేవర కలెక్షన్స్ పైన కూడా పెద్ద చర్చ జరిగిందని చెప్పవచ్చు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితర నటీనటులు కీలకమైన పాత్రలలో నటించారు. చివరిలో ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చూపించారు.

దేవర 2 ఉంటుందా?

ఇటీవలే సెప్టెంబర్ 27వ తేదీన దేవర సినిమా విడుదలై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో తెలుగు స్టేట్ లలో స్పెషల్ షోస్ కూడా వేశారు. కానీ మేకర్స్ నుంచి దేవర సీక్వెల్ పైన ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా డైలమాలో పడ్డారు. రెండు భాగాలుగా డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేశారు. కానీ దేవర 2 కచ్చితంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నప్పటికీ.. అదంతా కూడా అంత ఈజీ కాదు అనే విధంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Sree Mukhi: స్టైలిష్ లుక్ లో శ్రీముఖి గ్లామర్ అందాలు.. ఫోటోలు వైరల్!

దేవర 2 అనౌన్స్మెంట్ ఎప్పుడు?

ఇటీవల చిన్నపాటి గాయం అవ్వడం చేత విశ్రాంతి తీసుకుంటున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా అయిపోయిన వెంటనే రాబోతున్న మైథాలజికల్ సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో కొరటాల శివ దేవర 2 సినిమా పట్టాలెక్కించాలంటే మాత్రం 2027 ఎండింగ్ లోనే చేయాల్సి ఉన్నది. డైరెక్టర్ కొరటాల శివ కూడా బాలయ్యతో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితేనే ఎన్టీఆర్ దేవర 2 సినిమా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. NBK -112 సినిమా 2027 సంక్రాంతి నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది.

- Advertisement -
Advertisement

also read:Meenakshi Chaudhary:నానికి జోడిగా గోల్డెన్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఫిక్స్?

చిత్ర బృందం స్పందిస్తుందా?

కానీ టాలీవుడ్ లో వినిపిస్తున్న రూమర్ ప్రకారం కొరటాల శివ దేవర 2 (Devara 2)సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు గతంలో వినిపించినా.. ఈ మధ్య అసలు ఈ విషయం గురించి ఎక్కడ టాక్ వినిపించలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు కూడా దేవర2 సినిమా అంటే రిస్కే అంటూ కామెంట్స్ చేశారు. గత ఏడాది కళ్యాణ్ రామ్ మాత్రం కచ్చితంగా దేవర 2 సినిమా ఉంటుందనే విధంగా తెలియజేశారు. కానీ ఈ మధ్య వినిపిస్తున్న వార్తల ప్రకారం అసలు దేవర 2 ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో అభిమానులు ఉన్నారు. మొత్తానికి ఈ విషయం పైన అటు కొరటాల శివ కానీ ఎన్టీఆర్ టీం కానీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. ఒకవేళ రావాలనుకున్న సరే 2028 వరకు దేవర 2 సినిమా కోసం అభిమానులు వెయిట్ చేయవలసి ఉంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you