Tollywood:ప్రతి శుక్రవారం రోజున ఎన్నో చిత్రాలు విడుదలై అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతుంటాయి. మరికొన్ని ఫెయిల్యూర్ గా మిగులుతూ ఉంటాయి. అలా భారీ బడ్జెట్ చిత్రాలు, యాక్షన్ చిత్రాలు , స్పై ఏజెంట్ చిత్రాలు వంటివి విడుదల అవుతూ ఉన్నాయి. గాంధీ జయంతి సందర్భంగా తెలుగు బాక్సాఫీస్ వద్ద కొన్ని చిత్రాలు(Tollywood) రిలీజ్ అవ్వడానికి సిద్ధమయ్యాయి. అక్టోబర్ 2వ తేదీన వచ్చే సెలవు దినాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏకంగా 5 చిత్రాలు సైతం థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.
అక్టోబర్ 2న విడుదల కాబోతున్న చిత్రాలు..
అయితే థియేటర్ల పంపకాలు ప్రేక్షకుల ఆదరణ బట్టి చూస్తూ ఉంటే.. ఏ ఒక్క సినిమాతో కూడా బాక్సాఫీస్ లెక్కలు అంత సులువుగా సేఫ్ అయ్యేలా కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరు సంపాదించిన ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధించాలి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ వస్తే సినిమాకి బాగా కలిసి వస్తుంది.
also read:The Paradise:నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు..!
వీకెండ్స్ లో ప్రేక్షకులను మెప్పించే చిత్రం ఏంటి..
అలాగే మరొక యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం సిగ్మా. ఈ సినిమాకి కూడా మౌత్ టాక్ బాగొస్తేనే బరిలో ఉంటుంది. అలాగే కీర్తి సురేష్ ప్రధానోపాత్రలో నటిస్తున్న డోరతి చిత్రం ఇప్పటికే తమిళంలో విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఇందులో కొన్ని అభ్యంతరకర సీన్స్ ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి . దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారు అనే విషయం పైన కూడా చాలామంది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. వీటితోపాటుగా అనకాపల్లి అనే ఒక చిన్న సినిమా కూడా పోటీ పడుతుంది. ఈ సినిమాలతో పాటు ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీ గా రాబోతున్న చిత్రం తెల్ల కాగితం. ఈ సినిమా హైప్ కోసం ఇందులో ఉండే ఒక సీన్ ని లీక్ చేశారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
also read:Amala Paul:ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసిన అమలాపాల్..!
అంచనాలు పెంచేసిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్..
ముఖ్యంగా వీటన్నిటిలో సత్తా చాటే సినిమా ఏదైనా ఉంది అంటే అది ఫహద్ ఫాజిల్ నటిస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే సినిమాపై మాత్రమే ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని రాజమౌళి సమర్పించడం ..బాలకృష్ణ , ఎన్టీఆర్ వంటి వారి మద్దతు కూడా నిలవడంతో ఈ సినిమా పట్ల ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతోంది. వీటికి తోడు ఇప్పటికే థియేటర్లలో విడుదలైన ది ప్యారడైజ్ సినిమా కూడా తన సత్తాని చాటాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేవలం మొదటి రోజు వచ్చి ఓపెనింగ్స్ మాత్రమే కాకుండా వీకెండ్ నాటికి వచ్చేటువంటి పబ్లిక్ టాక్ సినిమాలే నిలుస్తాయి. మరి ఎవరి కంటెంట్ లో ఎంత దమ్ముందో తెలియాలి అంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.




