Irumudi movie: టాలీవుడ్ హీరో రవితేజ తాజాగా నటించిన చిత్రం ఇరుముడి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివా నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కించగా.. డివోషనల్ థ్రిల్లర్ చిత్రంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టి రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇరుముడి సినిమా రవితేజ కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకుంది. తెలుగు రాష్ట్రాలలో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది ఇరుముడి . ఇటీవల ఓటీటిలోకి వచ్చినా కూడా రికార్డులు సృష్టిస్తోంది.
ఇరుముడి సినిమాలో చూపించిన బ్రిడ్జ్ కూలిపోయింది..
ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇరుముడి చిత్రంలోని కొన్ని సన్నివేశాలు అల్లూరి జిల్లా చింతూరు మండలం కొల్లూరు జలపాతం దగ్గర తీసిన సీన్స్ సినిమాలో మనం చూసే ఉంటాము . ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు నిలయంగా నిలిచింది . ఈ నేపథ్యంలోనే ఇరుముడి సినిమా విడుదలైన తర్వాత ఈ ప్రదేశానికి పర్యటకులకు రాక ఎక్కువగా పెరిగింది. గతంలో వందల సంఖ్యలో మాత్రమే వచ్చేవారు. ఇప్పుడు వేల సంఖ్యలో పెరిగిపోయింది. ముఖ్యంగా కొల్లూరు జలపాతం దగ్గర సినిమా షూటింగ్ కోసం ఏర్పాటుచేసిన ఒక చెక్క బీచ్ పర్యటకులను మరింత ఆకట్టుకుందని చెప్పవచ్చు.
also read:Dhurandhar 2:బుల్లితెరపై ధురంధర్ 2 ఎప్పుడంటే..?
వైరల్ గా మారిన ఫోటోలు , వీడియోలు..
ఇదంతా ఇలా ఉంటే అల్లూరి జిల్లాలలో భారీ వర్షాలు కురవడంతో కొండ వాగుల నుంచి భారీగా వరద నీరు రావడంతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నీటి ప్రవాహానికి ఒక్కసారిగా బ్రిడ్జి వద్ద తాకిడి ఎక్కువ అవ్వడంతో ఆ తాకిడికి జలపాతం వద్ద ఏర్పాటుచేసిన బ్రిడ్జి కూడా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీటిని చూసి కొల్లూరు వచ్చే పర్యటకులకు నిరాశని కలిగిస్తోంది. బ్రిడ్జి ను సందర్శించిన సమయంలో తీసుకున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
also read:Amithabh Bachchan: హీరో అమితాబ్ బచ్చన్ కు గాయం..!
ఇరుముడి సినిమా విశేషాలు..
ఇరుముడి చిత్ర విషయానికి వస్తే ..మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. రవితేజ కి జోడిగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా కూతురి పాత్రలో బేబీ నక్షత్ర అద్భుతంగా నటించింది. అలాగే ఇందులో సాయికుమార్, అజయ్ ఘోష్, స్వాసిక తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమాలో అయ్యప్ప స్వామి పాటలకు సంబంధించి ఉండడంతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఏది ఏమైనప్పటికీ రవితేజ కెరియర్ లోని ఇరుముడి(Irumudi movie) సినిమా చాలా స్పెషల్ గా మిగిలిపోయిందని చెప్పవచ్చు. గత కొన్ని నెలలుగా ఫ్లాప్ లతో సతమతమవుతున్న రవితేజను ఇరుముడి సినిమా పైకి లేపింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్ లో ట్రెండ్ సెట్ చేస్తోంది.
View this post on Instagram




