Mahesh Babu:మలయాళ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక పాపులారిటీ సంపాదించుకున్న హీరో ఫహద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. పుష్ప, విక్రమ్, పుష్ప 2, తదితర చిత్రాలతో బాగా సుపరిచితమయ్యారు. ఇప్పుడు తాజాగా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే చిత్రంలో హీరోగా నటించారు.. ఈ చిత్రాన్ని రాజమౌళి సమర్పణలో రాబోతోంది. శశాంక్ ఏలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఎస్ ఎస్ కార్తికేయ, యార్లగడ్డ శోభు ,ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ పై మహేష్ బాబు రివ్యూ..
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ట్రైలర్ కూడా విడుదల చేయగా.. మరింత రెస్పాన్స్ పెరగడంతో పాటుగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా రివ్యూ ఇవ్వగా మరింత హైలెట్గా నిలిచింది. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలంటూ కొనియాడారు మహేష్ బాబు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా చూశాను. ఇది చాలా అద్భుతమైన, సంపూర్ణమైన అనుభూతిని ఇచ్చింది. చాలా చక్కగా, ఆనందంగా పంచే విధంగా ఈ సినిమాని తెరకెక్కించారని, పూర్తిగా ఎంటర్టైన్మెంట్ చూస్తూనే అదే సమయంలో ఎంతో మనసును కదిలించే కొన్ని భాగోద్వేగమైన అంశాలు కనిపించాయని తెలిపారు.
also read:Irumudi movie: వరదల్లో కొట్టుకుపోయిన ఇరుముడి మూవీ బ్రిడ్జి.. వీడియో వైరల్..!
చిత్ర బృందానికి స్పెషల్ విషెస్ తెలియజేసిన మహేష్ బాబు..
హీరో ఫహద్ ఫాజిల్ సర్ అద్భుతమైన నటుడు.. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆవిష్కరించుకుంటారు. ప్రయోగాలు చేస్తూ కొత్త రూపాలలో కనిపించడం, నిజంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం .. అలాగే చిన్నారి క్యూట్ సారాతో కలిసి చేసిన సన్నివేశాలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. వాళ్లు తమ పాత్రలలో జీవించేసినట్లుగా కనిపిస్తున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తోందని తెలిపారు. అలాగే ఎస్ఎస్ కార్తికేయ కు ఇంతకంటే ప్రత్యేకమైన ఆరంభం మరొకటి ఉండదు అంటూ తెలిపారు. శశాంక్ అద్భుతమైన పనితీరు సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చిత్ర బృందానికి నా ప్రేమతో కూడిన శుభాకాంక్షలు. మీ చేతులలో కచ్చితంగా ఒక అద్భుతం ఉంది అక్టోబర్ రెండును ప్రతి ఒక్కరు ఈ మ్యాజిక్ ను తప్పకుండా అనుభవించాలని మహేష్ బాబు(Mahesh Babu) ట్విట్ చేశారు.
also read:Dhurandhar 2:బుల్లితెరపై ధురంధర్ 2 ఎప్పుడంటే..?
మహేష్ బాబు సినిమాలు..
మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాలో చేస్తున్నారు. ఇది ఒక గ్లోబల్ ట్రాకింగ్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడవ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఇటీవల మహేష్ బాబు పాత్రకు సంబంధించి సినిమా షూటింగ్ అయిపోగానే .. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాని చూశారు. ఈ చిత్రానికి నిర్మాతగా ఎస్ ఎస్ కార్తికేయ వ్యవహరిస్తుండడంతో తన వంతు సపోర్టు చేశారు మహేష్ బాబు. అలాగే నందమూరి బాలకృష్ణ ఈ సినిమా ట్రైలర్ కు వాయిస్ ఓవర్ అందించగా.. జూనియర్ ఎన్టీఆర్ , సూర్య వంటి హీరోలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. మరి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.
Just watched the #DontTroubleTheTrouble Movie!!!What a beautifully complete experience this is ❤️❤️❤️ Such a well crafted and happy film… thoroughly entertaining and deeply moving at the same time 👏🏻👏🏻👏🏻 The film carries such a rare sense of warmth throughout!!!
Fahadh sir – u…
— Mahesh Babu (@urstrulyMahesh) September 30, 2026




