Thursday, October 1, 2026
HomeLATESTYouTuber Nandana:నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. యూట్యూబర్ నందు కామెంట్స్ ..!

YouTuber Nandana:నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. యూట్యూబర్ నందు కామెంట్స్ ..!

YouTuber Nandana: ప్రముఖ యూట్యూబ్ నందన ఇటీవల భారీ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో అరెస్టు కాగా, ఇప్పుడు ఒక ఊహించని పోస్ట్ షేర్ చేసింది..

on
- Advertisement -banner Ad

YouTuber Nandana:ప్రముఖ సోషల్ మీడియా యూట్యూబర్ గా పేరు సంపాదించిన వారిలో నందూస్ వరల్డ్ ఛానల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించడమే కాకుండా బిగ్ బాస్ 10వ సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడానికి ఇండియాకి వచ్చిందనే విధంగా వార్తలు వినిపించాయి.. యూట్యూబర్ , ఇన్ఫ్లుయెన్సర్ రమా నందన్ సెప్టెంబర్ 7వ తేదీన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల వల్ల మొదటిసారి స్పందించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. రమా తన సోషల్ మీడియా వేదికగా పలు వ్యాఖ్యలను అభిమానులతో పంచుకుంది.

అవకాశాలు వచ్చాయి కానీ.. నిజాన్ని తేల్చాలి..

రమా(YouTuber Nandana) ఇలా తెలియజేస్తూ.. సెప్టెంబర్ 7వ తేదీ నా జీవితంలో చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కోవడానికి కొన్ని నిమిషాల ముందు నేను విమానాశ్రయంలో అడుగు పెట్టాను.. నేను ఏదో టీవీ షోల కోసం, పబ్లిసిటీ కోసము ముందుకు రాలేదు. నిజానికి చాలా అవకాశాలు వచ్చినా.. వాటిని పక్కన పెట్టి ముందుగా నాకు వచ్చిన సమస్యను పరిష్కరించాలని నేనే స్వయంగా ముందుకు వచ్చాను. మా కుటుంబానికి ఏమాత్రం సంబంధంలేని వ్యవహారాలలో మా పేర్లను వాడారు. పరువును కావాలనే తీస్తున్నారు అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని తెలియజేసింది రమానందన.

- Advertisement -
Advertisement

also read:Radhika Sarathkumar:సోషల్ మీడియాపై నటి రాధిక శరత్ కుమార్ ఫైర్..!

కావాలని నా కుటుంబ గౌరవాన్ని, పరువును తీస్తున్నారు..

అంతేకాకుండా నేను తప్పు చేయలేదని నాకు తెలుసు. నిజం కోసమే తాను నిలబడుతున్నానని, తనకు ఎదురయ్యే ఎలాంటి పరిణామాలనైనా సరే తాను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని నిజాలు బయటికి వస్తాయి.. దీని వెనుక సూత్రధారులు కూడా ఖచ్చితంగా సమాధానాన్ని చెబుతారు.. ఇది నేనేదో సీన్ క్రియేట్ చేయడం కోసం చెప్పలేదు. నా కుటుంబ గౌరవాన్ని, నిజాన్ని కాపాడుకోవడం కోసమే చేస్తున్న పోరాటం.. కన్నీళ్లు రావచ్చు.. ఎంత బాధ అయినా కలగవచ్చు.. ఎన్ని గడ్డు పరిస్థితులైన ఎదురవచ్చు. కానీ నేను చేయని తప్పుకి ఎప్పుడు కూడా తలవంచనని తెలిపారు. కుంగిపోతానేమో కానీ ఓడిపోను నిలబడి తీరుతానంటూ రమానందన తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Prabhash:ప్రభాస్ సినిమాకి టికెట్స్ ఇవ్వలేదని థియేటర్ని కొనేసిన నిర్మాత..!

కచ్చితంగా అందరి గుట్టు బయట పెడతాను..

రమానందన యూకేలో జాబ్స్, వీసాల కేసులో కొంతమందిని మోసం చేసిందనే విధంగా ఆరోపణలు వినిపించాయి. వీటిమీద రమానందన పైన కేసు ఫైల్ అవ్వడంతో ఈ వివాదంలో ఈమె చిక్కుకుంది. ఎయిర్ పోర్టులో లుక్ అవుట్ నోటీసుల వ్యవహారం నడిచిన తర్వాత ఈమె పోస్ట్ చేయడం గమనార్హం .తన పైన కావాలనే కొంతమంది కుట్ర చేయించారని , అసలు దోషులు వేరే ఉన్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం పైన కొంతమంది ఆమెకు సపోర్ట్ చేయగా , మరి కొంతమంది బాధితులు గురించి కూడా ఆలోచించాలిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ అయితే వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you