Friday, October 2, 2026
HomeLATESTSamantha:సమంత విషయంలో బాంబే హైకోర్టు సీరియస్..!

Samantha:సమంత విషయంలో బాంబే హైకోర్టు సీరియస్..!

Samantha: సోషల్ మీడియాలో సమంత అనుమతి లేకుండా ఆమె ఫోటోలను , గొంతును ఉపయోగిస్తున్న నేపథ్యంలో బాంబే హైకోర్టు సీరియస్ అయింది.

on
- Advertisement -banner Ad

Samantha:టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ లలో సమంత కూడా ఒకరు. ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించి, తన అందంతో, అభినయంతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న సమంత లక్కీ హీరోయిన్ గా కూడా కొంతమంది హీరోలకు మారింది. అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకొని విడాకుల అనంతరం కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడుమోరు ను ప్రేమించి రెండో వివాహం చేసుకుంది. గర్భవతిగా ఉన్న సమంత త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది.

సమంతకు మధ్యంతర రక్షణ కల్పించిన హైకోర్టు..

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సినీ తారలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, వాయిస్లను ఉపయోగించి.. వీటి ద్వారా డీప్ ఫేక్ కంటెంట్ ని వైరల్ గా చేస్తున్నారు. ఇది సెలబ్రెటీలకు చాలా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన్ సమంత దాఖలు చేసిన పిటీషన్ పైన బాంబే హైకోర్టు పలు కీలకమైన ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. సమంత అనుమతులు లేకుండా ఆమె పేరును కానీ , ఫోటోలను కానీ ,గొంతును కానీ ఉపయోగించకూడదని.. అలా ఉపయోగించి రూపొందించిన కంటెంట్ పైన కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది..

- Advertisement -
Advertisement

also read:Varalakshmi Sarathkumar:తల్లి కావడంపై వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్..!

సమంత పిటిషన్ లో ఏం తెలిపిందంటే..

ఏఐ ద్వారా వచ్చిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా డిజిటల్ మీడియా సంస్థలు ఇతర ప్లాట్ఫాములలో తన ఫోటోలను పర్మిషన్ లేకుండా ఉపయోగిస్తున్నారంటూ సమంత(Samantha) కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం పైన విచారణ జరిపించిన ధర్మాసనం పర్మిషన్ లేని కంటెంట్ను తొలగించాలంటూ ఆయా సంస్థలకు ఆదేశాలను జారీ చేసింది. తన పేరు , ఫోటోలు , వాయిస్ వంటి వ్యక్తిగత విషయాలను తన అనుమతి లేకుండా ఏఐ ద్వారా కంటెంట్ ను ఉపయోగించి మార్పింగ్ ఫోటోలు చేయడం వల్ల తన వ్యక్తిత్వ హక్కులకు, గోప్యతకు భంగం కలుగుతోందని సమంత పిటిషన్ లో తెలియజేశారు. అంతేకాకుండా వీటిని ఉపయోగించుకొని యాడ్స్ చేసి ప్రమోషన్స్ కూడా చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమంత పిటిషన్లో తెలిపిందట.

- Advertisement -
Advertisement

also read:Tollywood 2027:సీనియర్ హీరోలంతా సంక్రాంతి టార్గెట్..!

సమంతకు అనుకూలంగా కోర్టు తీర్పు..

విచారణ సందర్భంగా సమంత వ్యక్తిత్వ హక్కులు, పబ్లిసిటీ హక్కులు ఇతర అంశాలను కోర్టు పరిష్కరించి సమంతా కు సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు అసభ్యకరమైన కంటెంట్ ను తొలగించడంతోపాటుగా భవిష్యత్తులో సమంతా పేరు , ఫోటో, వాయిస్ ను పర్మిషన్ లేకుండా ఉపయోగించకూడదంటూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఏఐ ద్వారా ఒక వ్యక్తి గుర్తింపును మార్చడం లేదా గొంతు అనుమతి లేకుండా ఉపయోగించడం వల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని, ఇలాంటి కంటెంట్ పైన ఫిర్యాదులు వచ్చినప్పుడు సోషల్ మీడియా ఆన్లైన్ మీడియా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కోర్టు తెలియజేసింది. చివరిగా సమంత మా ఇంటి బంగారం సినిమాతో మంచి విజయాన్ని అందుకొని 100 కోట్ల క్లబ్ లోకి చేరింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you