Akshara Hassan:సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలామంది సక్సెస్ కాలేకపోయిన వారు ఉన్నారు. అలాంటి వారి లిస్టులో నటి అక్షర హాసన్ కూడా ఉన్నారు. కమలహాసన్ చిన్న కూతురు గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ శృతిహాసన్ సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కెరియర్ ప్రయాణం మాత్రం అంతగా సాగలేదని చెప్పవచ్చు. ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో అక్షర తన కెరియర్ ,చదువు , తల్లిదండ్రులు ప్రోత్సాహం, భవిష్యత్తు యొక్క లక్ష్యాల గురించి పలు విషయాలను వెల్లడించింది.
డాన్స్ కొరియోగ్రాఫర్ గా మారి ఆ తర్వాతే నటిగా..
అక్షర హాసన్ మాట్లాడుతూ.. సాధారణంగా స్టార్ కిడ్స్ అంటే నటనతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెడతారని చాలామంది అనుకుంటారు.. అయితే అక్షర హాసన్ మాత్రం మొదట డాన్స్ కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి, స్నేహితుల మ్యూజిక్ వీడియోల ద్వారా కొరియోగ్రాఫర్ చేసినట్లుగా తెలిపింది . ఆ తర్వాత దర్శకత్వంపై ఆసక్తి పెరగడంతో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. నటిగా మారడం కూడా ముందుగా తీసుకున్న నిర్ణయం కాదని, ప్రయత్నించకుండా అవకాశాన్ని తిరస్కరించడం ఎందుకనే ఆలోచనతోనే ఆ వైపుగా నటనలో అడుగు పెట్టానని తెలిపింది.
also read:Kayadu Lohar: క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మదిని దోచిన కయాదు లోహర్!
అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను..
అక్షర హాసన్(Akshara Hassan) మాట్లాడుతూ.. తనకు మొదటి నుంచే ఎక్కువగా దర్శకత్వం చేయాలని ఆసక్తి ఉండేది.. నా మొదటి ఉద్యోగం నటన కాదు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం అంతకంటే కాదు.. డాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత డైరెక్షన్ చేయాలని ఉద్దేశంతోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. భవిష్యత్తులో కచ్చితంగా మెగా ఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తానంటూ అక్షర హాసన్ వెల్లడించింది.
also read:Bigg boss 10:బిగ్ బాస్ షో లోకి వైల్డ్ కార్డు ద్వారా బుల్లితెర నటి ఎంట్రీ..!
పదవ తరగతి మూడుసార్లు ఫెయిల్ అయ్యాను..
తన విద్యాభ్యాసం గురించి తెలియజేస్తూ ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడింది అక్షర హాసన్. తాను హైస్కూల్లో చదువుతున్నప్పటికీ తాను అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయానని తెలిపింది. ముఖ్యంగా పదవ తరగతి పరీక్షలలో వరుసగా మూడుసార్లు ఫెయిల్ అవ్వడం చదువు పైన ఆసక్తి పూర్తిగా తగ్గిపోయేలా చేసింది చదువుల పాస్ కావడం కష్టమని భావించే విద్యాభ్యాసాన్ని మధ్యలో ఆపివేశాను అంటూ వెల్లడించింది.
ఇంట్లో తల్లిదండ్రుల సలహా ఎప్పటికీ ఉంటుంది..
ఇంట్లో సినిమాల గురించి నిర్మొహమాటం లేకుండా మాట్లాడుకుంటామని తెలిపింది. తన నటన నచ్చకపోతే తల్లిదండ్రులు ముఖం మీద చెప్పేస్తారని చాలా చెత్తగా నటించావని కూడా చెప్పడానికి ఏమాత్రం వెనకాడరంటూ తెలిపింది అక్షర హాసన్. చిన్నచిన్న తప్పులను గుర్తించి వాటిని సరిచేసుకునేలా ప్రోత్సహిస్తారు అని కూడా తెలిపింది. మొత్తానికి అక్షర హాసన్ తన గోల్ ఏంటనే విషయం పైన క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్గా పెద్దగా సినిమాలలో నటించని అక్షర హాసన్ మరి డైరెక్టర్ గా ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి మరి.




