Saturday, October 3, 2026
HomeLATESTRanaBali:విజయ్ ముందే మీసం మెలేస్తూ తొడ కొట్టిన రష్మిక.. వీడియో వైరల్!

RanaBali:విజయ్ ముందే మీసం మెలేస్తూ తొడ కొట్టిన రష్మిక.. వీడియో వైరల్!

RanaBali: విజయ్ దేవరకొండ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా రణబాలి షూటింగ్ సెట్ నుండి జయమ్మకు సంబంధించిన ఒక క్యూట్ వీడియో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

RanaBali:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గీతాగోవిందం సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపు 8 సంవత్సరాల పాటు రహస్యంగా తమ ప్రేమ బంధాన్ని కొనసాగించిన ఈ జంట.. ఎట్టకేలకు 2026 ఫిబ్రవరిలో తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మళ్లీ తమ కెరియర్ పై దృష్టి సారించింది ఈ జంట.

జయమ్మ క్యూట్ వీడియో వైరల్..

అందులో భాగంగానే పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం రణబాలి(RanaBali) . రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాణంలో.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అటు విజయ్ దేవరకొండ ఇటు రష్మిక మందన్న తమ అధికారిక ఇంస్టాగ్రామ్ వేదికలుగా షూటింగ్ సమయంలో తీసుకున్న క్యూట్ మూమెంట్స్ ను అభిమానులతో పంచుకుంటున్నారు.

- Advertisement -
Advertisement

also read:Nushrratt bharuccha:తాజ్ మహల్ హీరోయిన్ కి ప్రమాదం.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

విజయ్ ముందే మీసం మెలేసి, తొడ కొట్టిన జయమ్మ..

అందులో భాగంగానే తాజాగా విజయ్ ముందే రష్మిక మీసం మెలెస్తూ తొడ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయంలోకి వెళ్తే .. విజయ్ దేవరకొండ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వీడియోని పంచుకున్నారు. ఊయలపై కూర్చున్న విజయ్ ముందు విజయ్ లాగా రష్మిక యాక్టింగ్ చేస్తూ వెళ్లి.. ఆయన స్వాగ్ లో నడుస్తూ వెళ్లి మీసం మేలేస్తూ తొడకొట్టింది. ఇందుకు సంబంధించిన క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మొత్తానికైతే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న లవ్లీ కపుల్ ను చూసి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ జంటకు దిష్టి తగలకూడదు అంటూ ఈవిల్ ఐ ఎమోజీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తుండగా జయమ్మగా రష్మిక మందన్న నటిస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Chiranjeevi:అతడే రియల్ హీరో.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..!

రష్మిక..” ఒరేయ్.. నీ అక్క” అని పిలుస్తుంది – విజయ్

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను అప్పుడే మొదలుపెట్టేశారు రణబాలి మూవీ. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ .. రష్మిక మందన్నకు సంబంధించిన ఒక విషయాన్ని అభిమానులతో పంచుతున్నారు. ఆయన మాట్లాడుతూ..” రష్మిక మందన్న ఒక రెండు సార్లు పిలుస్తుంది. అప్పటికి నేను పలకకపోతే.. ఒరేయ్ నీ అక్క అంటూ సంబోధిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆమె కిచెన్లోకి వెళ్తే చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది అంటూ చేసిన కామెంట్లు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి అయితే రష్మిక ,విజయ్ దేవరకొండ జంట మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

- Advertisement -
Advertisement

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you