Sunday, October 4, 2026
HomeLATESTVaranasi:సరికొత్త రికార్డు సృష్టించిన వారణాసి సినిమా..!

Varanasi:సరికొత్త రికార్డు సృష్టించిన వారణాసి సినిమా..!

Varanasi: వారణాసి మూవీ ఆర్ ఆర్ షూటింగ్ టైం రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించబోతోంది ముఖ్యంగా రాజమౌళి సినీ కెరియర్లో ఇది మరో రికార్డ్ అని చెప్పవచ్చు.

on
- Advertisement -banner Ad

Varanasi:సూపర్ స్టార్ మహేష్ బాబు , డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం వారణాసి. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే విలన్ గా పృధ్విరాజ్ సుకుమారన్ నటించారు. వాస్తవానికి డైరెక్టర్ రాజమౌళి సినిమా అంటే సుమారుగా ఏళ్ల తరబడి సినిమా షూటింగ్ జరుగుతోందనే భావన అందరిలో ఉన్నది. బాహుబలి సిరీస్, RRR వంటి చిత్రాలు ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు.. కానీ ఈసారి మాత్రం రాజమౌళి తన ట్రేడ్ మార్కుకు భిన్నంగా వారణాసి సినిమాను ఊహించని విధంగా పూర్తి చేసే పనిలో పడ్డారు.

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ టైమ్ ని బ్రేక్ చేసిన వారణాసి..

వారణాసి(Varanasi) సినిమా షూటింగ్ ఇప్పటికే 90% పైగా పూర్తి అయినట్లు స్వయంగా రాజమౌళి ఇటీవలే వెల్లడించారు. సెప్టెంబర్ 28న నిర్వహించిన ఒక ప్రత్యేక సెషన్ లో వారణాసికి సంబంధించి పలు అంశాల పైన రాజమౌళి మాట్లాడడం జరిగింది. వారణాసి సినిమా షూటింగ్ స్పీడ్ అవ్వడంతో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి RRR చిత్రాన్ని 1011 రోజులపాటు షూటింగ్ చేయగా.. 2018 నవంబర్ 19న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ 2021 ఆగస్టు 26న పూర్తి చేశారు.

- Advertisement -
Advertisement

also read:Nani:ఇక జీవితంలో ఆ షో చేయను..నాని షాకింగ్ కామెంట్స్!

రెండేళ్లు పూర్తి కాకుండానే ప్రేక్షకులు..

కానీ వారణాసి సినిమాని మాత్రం కేవలం 606 రోజులలోనే పూర్తి చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2025 జనవరి 24న సినిమా షూటింగ్ ప్రారంభించగా 2026 సెప్టెంబర్ 22 నాటికి పూర్తి అయినట్లుగా సమాచారం. దీంతో సినిమా షూటింగ్ పరిది పరంగా చూస్తే వారణాసి సినిమా సరికొత్త రికార్డులను సృష్టించినట్లు కనిపిస్తోంది. అత్యంత భారీ స్థాయిలో అత్యాధునిక టెక్నాలజీ, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడంతో అటు ఫ్యాన్స్ ట్రేడ్ వర్గాలు సైతం రాజమౌళి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:RGV:ఆ వీడియోను వైరల్ చేసింది మీరే.. డీప్‌ఫేక్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!

సృష్టించే రికార్డులు ఎన్నో..

భారీ యాక్షన్ సీన్స్ అంతర్జాతీయ స్థాయిలో విజువల్స్ తో తెరకెక్కించిన ఈ సినిమా పై అభిమానులలో మరింత ఆసక్తి పెంచేస్తోంది. ఇక మిగిలిన షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్ ఇతర నిర్మాణ పనులను కూడా మరింత వేగవంతంగా పూర్తి చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు హీరోగా, రాజమౌళి టేకింగ్ వల్ల ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయా. వారణాసి చిత్రంలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు. 2027 ఏప్రిల్ ఏడవ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. ఇప్పటివరకు కేవలం పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్ మాత్రమే విడుదల చేయగా.. వాటికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. మరి రాబోయే రోజుల్లో టీజర్ ట్రైలర్తో ఎటువంటి అంచనాలను పెంచేస్తుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you