Varshini:బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్లో 31వ రోజు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వర్షిణి, అపూర్వ చుట్టూ జరిగిన సంఘటనలు హౌస్‌లో చర్చకు దారితీశాయి. ముందుగా వర్షిణి తన మనసులోని బాధను త్రిగుణ్‌తో పంచుకుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చెబుతూ భావోద్వేగానికి గురైంది.
తన చిన్ననాటి గురించి వర్షిణి మాట్లాడుతూ.. తాను ఎక్కువగా తల్లితోనే పెరిగానని చెప్పింది. తండ్రి తనకు అందుబాటులో లేకపోవడం వల్ల చిన్నప్పటి నుంచి ఒక వెలితి తనలో ఉందని వివరించింది. తండ్రి చేయి పట్టుకుని నడిచే అవకాశం తనకు ఎప్పుడూ రాలేదని, ఆ భావన తనలో చాలా కాలంగా ఉందని తెలిపింది.
ముకేశ్‌తో బంధంపై వర్షిణి క్లారిటీ :
ముకేశ్‌తో తాను ఎందుకు సన్నిహితంగా ఉంటున్నానో కూడా వర్షిణి(Varshini) వివరించింది. బయట నుంచి చూసేవారికి తమ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు అనిపించవచ్చని, కానీ అసలు విషయం వేరని చెప్పింది. ముకేశ్ చేయి పట్టుకున్నప్పుడు తనలోని భయం, ఒంటరితనం కొంత తగ్గినట్లు అనిపిస్తుందని పేర్కొంది.
తాను ఏం మాట్లాడినా ముకేశ్ ఓపికగా వింటాడని, అందుకే అతనితో భావోద్వేగంగా కనెక్ట్ అయ్యానని వర్షిణి చెప్పుకొచ్చింది. తమ మధ్య ఉన్నది ప్రేమకంటే తన చిన్ననాటి భావోద్వేగాలకు సంబంధించిన అనుబంధమని స్పష్టం చేసింది.
also read:Tollywood: నడవలేని స్థితిలో టాలీవుడ్ కమెడియన్!
అపూర్వపై దేబ్జానీ, వంశీ చర్చ :
మరోవైపు హౌస్‌లో అపూర్వ గురించి దేబ్జానీ, వంశీ మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా దేబ్జానీ.. అపూర్వ గొడవ పడే సమయంలో ఆమె బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఇమిటేట్ చేస్తూ సరదాగా సెటైర్లు వేసింది.
దీనిపై వంశీ స్పందిస్తూ.. ప్రతి సీజన్లోనూ హౌస్‌లో ప్రేక్షకులకు కొంత చిరాకు తెప్పించే కంటెస్టెంట్ ఒకరు ఉండాల్సిందేనని వ్యాఖ్యానించాడు. ఆ కోణంలోనే అపూర్వలాంటి కంటెస్టెంట్లను తీసుకొస్తుంటారని చెప్పాడు.
also read:Bandla Ganesh:”నా పేరుతో రాజకీయాలు చేయొద్దు”.. బండ్ల గణేష్ ఘాటు బహిరంగ లేఖ !
టాస్క్‌లో చరణ్, అపూర్వకు ఫస్ట్ ప్లేస్ :
ఇక డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లను సేఫ్ జోన్‌కు తీసుకెళ్లేందుకు బిగ్ బాస్ ఓ టాస్క్ నిర్వహించాడు. ఇందులో కంటెస్టెంట్లను జంటలుగా విభజించారు. త్రిగుణ్–అమన్, నరేష్–రామ్ ప్రసాద్, చరణ్–అపూర్వ, ఝాన్సీ–ముకేశ్, రోహిత్–షాలిని జంటలుగా ఏర్పడ్డారు.
స్టార్ట్.. స్టార్.. సూపర్ స్టార్’ పేరుతో నిర్వహించిన ఈ టాస్క్‌లో కంటెస్టెంట్లు జంటలుగా పోటీపడ్డారు. స్టార్ సింబల్ సరిగ్గా వచ్చేలా ఇచ్చిన వస్తువులను సరైన అమరికలో ఏర్పాటు చేయడం ఈ టాస్క్‌లో ప్రధాన సవాలుగా నిలిచింది. పోటీలో చరణ్–అపూర్వ జంట తమ వేగంతో ఆకట్టుకుని అందరికంటే ముందుగా టాస్క్‌ను పూర్తి చేసి మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
త్రిగుణ్–అమన్ జంట రెండో స్థానంలో నిలిచింది. ఇక ఝాన్సీ–ముకేశ్ జంట మూడో స్థానంతో సరిపెట్టుకుంది. నరేష్–రామ్ ప్రసాద్ జోడీ నాలుగో స్థానంలో నిలవగా, రోహిత్–షాలిని జంట చివరి స్థానాన్ని దక్కించుకుంది. టాస్క్ మొత్తం ఉత్కంఠగా సాగడంతో హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య ఆసక్తికర పోటీ కనిపించింది. ప్రతి జంట తమకు కేటాయించిన సమయంలో వేగంగా వ్యవహరించేందుకు ప్రయత్నించింది.




