Friday, October 9, 2026
HomeLATESTTollywood: నడవలేని స్థితిలో టాలీవుడ్ కమెడియన్!

Tollywood: నడవలేని స్థితిలో టాలీవుడ్ కమెడియన్!

Tollywood: ప్రముఖ స్టార్ కమెడియన్ ఇప్పటికే నడవలేని స్థితిలో ఉండడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు

on
- Advertisement -banner Ad

Tollywood: టాలీవుడ్లో ఎంతోమంది కమెడియన్స్ కొత్తగా ఎంట్రీ ఇస్తున్నప్పటికీ కొంతమంది మాత్రమే అందులో గుర్తింపు సంపాదించుకుంటున్నారు. మరి కొంతమంది అడపా దడపా చిత్రాలు ఫేడ్ అవుట్ అవుతున్నారు. అలా ఒకప్పుడు తన కామెడీతో సిల్వర్ స్క్రీన్ పైన నవ్వులు పూయించిన కమెడియన్ స్టార్ హీరోల చిత్రాలలో కూడా తన మార్కు కామెడీతో అలరించారు. అలాంటి కమెడియన్ ఇప్పుడు తాజాగా మంచానికే పరిమితమయ్యారు. పక్షవాతం బారిన పడి కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడు ఆ కమెడియన్. ఆ కమెడియన్ ఎవరో కాదు రామచంద్ర.

మంచానికే పరిమితమైన రామచంద్ర..

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ సహాయం కోసం వేడుకుంటున్నారు. రవితేజ నటించిన వెంకీ సినిమాలో రామచంద్ర తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత సొంతం, దుబాయ్ శీను, లౌక్యం, కింగ్ తదితర సూపర్ హిట్ చిత్రాలలో (Tollywood)తన కామెడీతో ఆకట్టుకున్న రామచంద్ర, ఎక్కువగా హీరోలకు ఫ్రెండ్ క్యారెక్టర్లలో కూడా నటించారు. వందకు పైగా చిత్రాలలో నటించిన రామచంద్ర.. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారట. దీనికి తోడు పెరాలసిస్ సోకడంతో ఇప్పుడు పూర్తిగా మంచానికే పరిమితమయ్యారని, బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టి ఆయన ఎడమ చేయి కాలు పూర్తిగా పడిపోయాయని, దీనితో తాను కదలలేని, నడవలేని స్థితిలో ఉన్నానని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

- Advertisement -
Advertisement

also read:Bandla Ganesh:”నా పేరుతో రాజకీయాలు చేయొద్దు”.. బండ్ల గణేష్ ఘాటు బహిరంగ లేఖ !

బాగోగులన్నీ కూడా ఆయన తమ్ముడే చూసుకుంటున్నారు..

కమెడియన్ రామచంద్రకు వివాహం కాలేదు. ఆయన తల్లిదండ్రులు కూడా కన్నుమూశారు. దీంతో ప్రస్తుతం ఆయన బాగోగులన్నీ కూడా ఆయన తమ్ముడే చూసుకుంటున్నారని తెలిపారు. అలాగే రామచంద్ర సోదరుడు తన అన్న ఆవేదనను పంచుకుంటూ రామచంద్ర దాదాపుగా ఏడాదిగా రిహాబిలేషన్ సెంటర్ లోనే ఉంటున్నారు. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయిస్తున్నాము, ఇందుకోసం పలువురు సినీ ప్రముఖులు కూడా ఆర్థిక సహాయం చేశారు. వారి వల్లే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామని అయినా కూడా ఇప్పుడు మాకు నెలకు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇంకో రెండు మూడు నెలల వరకు ఇక్కడే ఉంచాలని వైద్యులు చెబుతున్నారని రామచంద్ర సోదరుడు తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Nana Patekar:సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ఎవరైనా దాతలు స్పందిస్తారా?

రామచంద్ర (Comedian Ramachandra)కు ప్రతిరోజు అయ్యే వైద్య ఖర్చులు , థెరపీకి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. దాతలు ఎవరైనా సరే స్పందించి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందిస్తే అది వైద్యానికి ఉపయోగపడుతుందంటూ రామచంద్ర సోదరుడు విజ్ఞప్తి చేశారు. ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించిన రామచంద్రకు సహాయం చేయడానికి హీరోలు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆయన అభిమానులు కూడా నిరుత్సాహంతో ఉన్నారు. మరి ఈ విషయం తెలిసిన అనంతరం హీరోలు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి మరి. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారడమే కాకుండా ఈ న్యూస్ వైరల్ గా మారింది. మరి హీరో రవితేజకు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్స్ ఇచ్చిన రామచంద్ర కు సహాయం చేయాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you