Indian 3:కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమా పైన భారీగా అచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సేనాపతి మళ్ళీ వస్తున్నాడు అంటూ ఈసారి శంకర్ కచ్చితంగా కొత్త పాయింటుతో అదరగొట్టేస్తారని అందరూ భావించారు. కానీ గడిచిన రెండేళ్ల క్రితం ఎన్నో అంచనాల మధ్య ఇండియన్ 2 సినిమా విడుదల అయ్యి భారీ డిజాస్టర్ గా మిగిలింది.
ఇండియన్ 3 పై క్రేజీ అప్డేట్..
సినిమా చూసిన వారంతా కూడా తలలు పట్టుకున్నారు. చివరిలో ఇండియన్ 3 సినిమా ఉంటుందనే విషయాన్ని కూడా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ముఖ్యంగా సెకండ్ పార్ట్ ఇంత ఘోరంగా ఉన్నా ఇండియన్ 3(Indian 3) సినిమా అవసరమా అంటూ చాలామంది అభిమానులు, నెటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో భారతీయుడు 3 సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా మూడోసారి భారతీయుడు 3 సందడి చేయడానికి రాబోతున్నట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
also read:Spirit:ప్రకాష్ రాజ్ ఔట్.. స్పిరిట్‌లోకి అనిల్ కపూర్ ఎంట్రీ? ఇదే అసలు ట్విస్ట్!
అక్టోబర్ 8వ తేదీన ఆ అప్డేట్ రిలీజ్..
ఈ సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అక్టోబర్ 8వ తేదీన 11:45 గంటలకు ఒక క్రేజీ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయేలా కనిపిస్తున్నాయి. అయితే ఈ అప్డేట్ లో లైకా ప్రొడక్షన్ ఇండియన్ 3 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.. తాజాగా విడుదల చేసిన పోస్టర్లు “ఇండియన్ 3 వార్ మోడ్ ” అని క్యాప్షన్ తో ఒక పోస్టర్ని విడుదల చేసి మూడు గుర్రాల మీద కమలహాసన్ విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు చూపించారు.
also read:Poonam Kaur:టాలీవుడ్ డైరెక్టర్ పై పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్..!
అంచనాలు పెంచేసిన చిత్ర బృందం..
భారతీయుడు 3 చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోందని గతంలోనే ప్రకటించారు . అయితే ఇందుకు సంబంధించి సినిమా షూటింగ్ కూడా చిత్ర బృందం పూర్తి చేశారని తెలుస్తోంది. స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి మూలాల కథను ఈ మూడవ భాగంలో చాలా పవర్ఫుల్ గా చూపించబోతున్నారనే విధంగా టాక్ వినిపిస్తోంది. ఇండియన్ 2 సినిమాతో పోలిస్తే ఇందులో చాలానే యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ సీన్స్ ఉంటాయని వినిపిస్తున్నాయి. ఇందులో ఎస్ జె సూర్య, సిద్ధార్ద్ తో పాటుగా మరికొంతమంది కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఇండియన్ 3 చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని ప్రచారం కూడా జరిగింది.. కానీ ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెడుతూ ఈ సినిమాని థియేటర్లో విడుదల చేయడానికి చిత్ర బృందం ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు కనిపిస్తోంది. మరి ఇండియన్3 అటు కమలహాసన్ కు డైరెక్టర్ శంకర్ కి ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అధికారికంగా పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Senapathy is back with zero tolerance. 🔥 The resurgence begins in #Indian3 🇮🇳 War Mode. ⚔️
Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @anirudhofficial #Siddharth @MSKajalAggarwal @priya_Bshankar @actorsimha @iam_SJSuryah @dop_ravivarman @muthurajthangvl @sundarksam @teamaimpr
#Hindustani3 🇮🇳 #Bharateeyudu3 🇮🇳 #WarMode
— Lyca Productions (@LycaProductions) October 8, 2026




