Tollywood:టాలీవుడ్, కోలీవుడ్ లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలలో వైవిద్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అర్జున్.. పలు చిత్రాలలో హీరో గానే కాకుండా విలన్ గా కూడా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అర్జున్ కి ఇద్దరు కూతుర్లు.. ఇప్పుడు తాజాగా ఆయన కూతురు అంజనా వివాహ ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఈనెల 18న అంజనా వివాహం చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అర్జున్ ఇంట్లో మోగనున్న పెళ్లి భాజాలు..
దాదాపుగా 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్న అంజనా ఇప్పుడు పెద్దల సమక్షంలో తన ప్రియుడితో కలిసి ఏడడుగులు వేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. అయితే అంజనా కు కాబోయే భర్త ఎవరు? అనే విషయం ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. కానీ వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సైతం ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిమానులు మాత్రం చూడముచ్చటైన జంట అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ దక్షిణాది(Tollywood) సినీ ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా పేరు సంపాదించారు.
also read:Rashmika mandanna:రణబాలి ఈవెంట్ కి డుమ్మా కొట్టిన రష్మిక..!
పెళ్లికి సిద్ధమైన చిన్న కూతురు..
1998లో కన్నడ నటి నివేదను ప్రేమించి వివాహం చేసుకున్న అర్జున్ కు ఐశ్వర్య, అంజనా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందులో పెద్ద కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా కసాగుతోంది అలాగే తన తండ్రి వ్యాపార నిర్మాణ సంస్థలను చూసుకుంటుంది.. అర్జున్ చిన్న కుమార్తె అంజనా మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన ఫ్యామిలీ నేపథ్యానికి సంబంధించిన బిజినెస్‌లను చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా రాణిస్తోంది. అలా 2023ల హ్యాండ్ బ్యాగ్‌ల తయారీ సంస్థను కూడా మొదలుపెట్టింది ఈమె. అక్కడ తయారయ్యే హ్యాండ్ బ్యాగులన్నీ కూడా కేవలం పండ్ల తొక్కలు, కూరగాయల తొక్కలు, నార వంటి వాటితోనే తయారు చేస్తారట.
also read:Jabardasth Naresh:”సన్నిహితులే నన్ను ముంచేశారు”.. నరేష్ షాకింగ్ కామెంట్స్!
బిజినెస్ ఉమెన్ గా గుర్తింపు..
ఈ బ్యాగులన్నీ కూడా పర్యావరణానికి అనుకూలంగా తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ బ్యాగులకు ఇప్పుడు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం బిజినెస్ లో రాణిస్తూ ఉన్న అంజనా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైనట్లు వినిపిస్తోంది. అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్లాస్ట్.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో అభిరామి, ప్రీతి ముకుందన్ కీలకమైన పాత్రలో కనిపించారు . చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఓవరాల్ గా 75 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. అర్జున్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు తన వ్యాపారాలను కూడా దగ్గర ఉండి మరి చూసుకుంటున్నారు. మరి అర్జున్ కుటుంబానికి సంబంధించి గుడ్ న్యూస్ అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.
Action King #Arjun’s Daughter #Anjana is getting married on October 16th…..💍 https://t.co/K7fo7F1lOt
— Movie Tamil (@_MovieTamil) October 7, 2026




