Saturday, October 10, 2026
HomeLATESTNidhhi Agerwal:పెళ్లిపై గుడ్ న్యూస్ చెప్పిన నిధి అగర్వాల్..!

Nidhhi Agerwal:పెళ్లిపై గుడ్ న్యూస్ చెప్పిన నిధి అగర్వాల్..!

Nidhhi Agerwal: ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తనదైన సమాధానమిచ్చి అభిమానులను సంతోషపరిచింది...

on
- Advertisement -banner Ad

Nidhhi Agerwal:తెలుగు, తమిళ చిత్రాలలో తన అందం, అభినయంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ నిధి అగర్వాల్. నిధి అగర్వాల్ హైదరాబాదులో జన్మించినప్పటికీ ఎక్కువగా బెంగళూరు ప్రాంతంలోనే పెరిగింది. నిధి అగర్వాల్ 2017లో మున్నా మైఖేల్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2018లో సవ్యసాచి అనే తెలుగు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది.

తెలుగు అబ్బాయినే వివాహం చేసుకుంటానంటున్న నిధి అగర్వాల్.

ఆ తర్వాత 2021లో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. కానీ ఇప్పటివరకు నిధి అగర్వాల్(Nidhhi Agerwal) కు చెప్పుకోదగ్గ భారీ సక్సెస్ అందుకోలేదని అభిమానులు సైతం నిరుత్సాహంలోనే ఉన్నారు. హరిహర వీరమల్లు చిత్రంతో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించినా.. పెద్దగా సక్సెస్ కాలేదు. ది రాజా సాబ్ చిత్రంతో ప్రభాస్ జోడిగా నటించినా ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాలను కూడా షేర్ చేస్తోంది. అంతేకాకుండా అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వస్తూ పలు రకాల కామెంట్స్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -
Advertisement

also read:Tollywood:టాలీవుడ్ స్టార్ హీరో కూతురు పెళ్లి..?

అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..

ఇప్పుడు తాజాగా నిధి అగర్వాల్ ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరై తనకు ఎదురైన ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం తెలిపింది.. తెలుగు అబ్బాయిని వివాహం చేసుకుంటారా మీరు అని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా? ఈ విషయం పైన నిధి అగర్వాల్ స్పందిస్తూ.. అది తెలియదు కానీ మే బీ చేసుకోవచ్చు అంటూ చాలా సమాధానం చెప్పింది. అంతేకాకుండా తనకు తెలుగు రాష్ట్రాలతో ఉన్న అనుబంధాన్ని కూడా పంచుకుంది. తాను హైదరాబాదులోనే పుట్టానని తెలియజేస్తూ తాను కూడా తెలుగమ్మాయినే అంటూ నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది. నిధి అగర్వాల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం విన్న వెంటనే అభిమానులు ఖుషీ అవుతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Rashmika mandanna:రణబాలి ఈవెంట్ కి డుమ్మా కొట్టిన రష్మిక..!

నిధి అగర్వాల్ క్రేజ్..

నిధి అగర్వాల్ 2017లో జీ సినీ అవార్డ్స్ అందుకోగా 2019లో సైమ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ ఏడాది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా కనిపించలేదు నిధి అగర్వాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 33 సంవత్సరాలు. మరి వివాహ విషయం పైన చేసిన కామెంట్స్ నిజం చేస్తుందేమో చూడాలి మరి. తమిళనాడులో ఒక ప్రాంతంలో నిధి అగర్వాల్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు అభిమానులు. దీంతో తమిళనాడులో ఈమె క్రేజ్ ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you