Kiccha Sudeep:కన్నడ సినిమా ఇండస్ట్రీలో హీరోగా పేరు సంపాదించిన కిచ్చా సుదీప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. తెలుగు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించిన కిచ్చా సుదీప్ తనదైన యాక్టింగ్ తో అభిమానులను సంపాదించుకున్నారు. కిచ్చా సుదీప్ భార్య ప్రియ తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని చాలా సింపుల్ గా జరుపుకున్నారు. అయితే ఈ వేడుకకు సంబంధించి కొన్ని ఫోటోలు , వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో సుదీప్, ప్రియ ఒకరినొకరు పూలమాలలు వేసుకుంటూ కనిపించారు.
భార్యతో విడిపోవాలనుకున్న సుదీప్..
కిచ్చా సుదీప్, తన భార్య ప్రియాతో కలిసి సరదాగా గడుపుతున్నట్లుగా కనిపించారు. ఈ ఫోటోలు చూసిన పలువురు అభిమానులు సైతం ఈ జంటకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుదీప్ దంపతుల గురించి ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది. ఒకానొక సమయంలో కిచ్చా సుదీప్, ప్రియ దంపతులు విడాకుల వరకు వెళ్లారట. ఈ జంట 2015లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వినిపిస్తున్నాయి. అయితే ఆ తర్వాత మళ్లీ తమ మనసు మార్చుకుని కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
also read:Jailer 2:జైలర్ 2 లో మోహన్ లాల్ కి డూప్ వాడారా..?
కుమార్తె కోసమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న దంపతులు..
కిచ్చా సుదీప్(Kiccha Sudeep), ప్రియ అక్టోబర్ 18 ,2001న వివాహం చేసుకున్నారు. సాన్వి సుదీప్ అనే కుమార్తె జన్మించారు. వివాహమైన చాలా సంవత్సరాలు తర్వాత 2015లో వీరి బంధంలో మనస్పర్ధలు రావడంతో విడాకుల వరకు వెళ్లాల్సి వచ్చిందట .సుదీప్ ఒక నిర్ణీత మొత్తంలో భరణం కూడా చెల్లించడానికి సిద్ధమయ్యారట. అలాగే తన కుమార్తె సంరక్షణ బాధ్యతలను కూడా ప్రియ కు అప్పగించడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ తర్వాత దంపతులిద్దరూ కూడా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని విడాకుల ప్రక్రియను ముందుకు సాగనివ్వలేదు. 2017లో ఈ జంట తమ విడాకుల పిటిషన్ ని ఉపసంహరించుకున్నారు.
also read:Ramayana OTT:రామాయణం రిలీజ్‌లో బిగ్ ట్విస్ట్.. సబ్‌స్క్రిప్షన్ ఉన్నా డబ్బులు కట్టాల్సిందేనా?
వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న జంట..
కర్ణాటక కోర్టులో ఇద్దరు కలిసి జీవించడానికి లిఖితపూర్వకంగా అంగీకరిస్తూ ఒక లెటర్ ని కూడా అందించారు. అలా విడాకుల వరకు వెళ్లిన ఈ జంట ఇప్పుడు మళ్లీ అన్యోన్యంగా కలిసి జీవిస్తుండడం చూసి అభిమానులు కూడా ఆనందపడుతున్నారు. అయితే పెళ్లి వేడుకల ఫోటోలలో సుధీర్ పూలతో అలంకరించిన తన తల్లి సరోజ సంజీవ్ పెద్ద ఫోటోని ఉంచారు. కిచ్చా సుదీప్ తల్లి సరోజ 86 ఏళ్ల వయసులో 2024 అక్టోబర్ 20న మరణించారు. ప్రస్తుతం కిచ్చా సుదీప్ సినిమాల విషయానికి వస్తే.. బిల్లా రంగా, భాష, స్కూల్ బస్, శ్రీకృష్ణదేవరాయ వంటి చిత్రాలలో నటించారు.. అంతేకాకుండా కేకే అనే గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రానికి కూడా దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. అలాగే కన్నడ బిగ్ బాస్ రియాల్టీ షో కి హోస్టుగా కూడా వ్యవహరిస్తున్నారు కిచ్చా సుదీప్. ప్రస్తుతం కిచ్చా సుదీప్ కి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram




