Sunday, November 8, 2026
HomeLATESTtollywood:టాలీవుడ్ లో పెళ్లి బాజాలు..విజయ్, రష్మిక బాటలోనే మరో ప్రేమ జంట..!

tollywood:టాలీవుడ్ లో పెళ్లి బాజాలు..విజయ్, రష్మిక బాటలోనే మరో ప్రేమ జంట..!

tollywood:విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకకు వైష్ణవి చైతన్య హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆనంద్ దేవరకొండతో కలిసి ఆమె ఫొటోలు దిగారు.

on
- Advertisement -banner Ad

tollywood:టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ జంటకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

‘బేబీ’ సినిమాతో మొదలైన పరిచయం :

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య పరిచయం ‘బేబీ’ సినిమాతో ఏర్పడింది. ఈ చిత్రంలో(tollywood) వీరిద్దరూ జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా తెరపై ఆనంద్, వైష్ణవి మధ్య కనిపించిన కెమిస్ట్రీ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ స్నేహపూర్వకంగా ఉంటూ వచ్చారు.

- Advertisement -
Advertisement

also read:Vishnu Priya:డబుల కోసం రోజురోజుకి దిగజారిపోతున్న విష్ణు ప్రియ..!

రొమాంటిక్ ఫొటోలతో పెరిగిన ప్రచారం:

ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకకు వైష్ణవి చైతన్య హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆనంద్ దేవరకొండతో కలిసి ఆమె ఫొటోలు దిగారు. ముఖ్యంగా విజయ్, రష్మికలతో కలిసి ఈ ఇద్దరూ జంటగా దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లోని రొమాంటిక్ సన్నివేశాలు కూడా అభిమానుల చర్చకు కారణమయ్యాయి.

- Advertisement -
Advertisement

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల జంటపై గతంలో ఎలాంటి వార్తలు, ఊహాగానాలు వినిపించాయో.. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య విషయంలోనూ అలాంటి చర్చలే మొదలయ్యాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. కొందరు అభిమానులైతే వైష్ణవి త్వరలోనే దేవరకొండ కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టబోతున్నారంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

also read:RGV:సల్మాన్ ఖాన్‌పై లారెన్స్ బిష్ణోయ్ పగ.. ఆర్జీవీ ఘాటు సెటైర్లు!

- Advertisement -
Advertisement

పెళ్లి వార్తలపై ఇద్దరూ ఏమన్నారంటే? :

ఈ వార్తలపై ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఇప్పటికే తమదైన శైలిలో స్పందించారు. తమ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆనంద్ స్పష్టం చేశారు. తామిద్దరం మంచి స్నేహితులమని, అంతకుమించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని వెల్లడించారు. ముఖ్యంగా వైష్ణని కెరీర్ ఇప్పుడిప్పుడే మంచి దశలోకి అడుగుపెడుతోందని, ఆమెకు నటిగా ఎంతో మంచి భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు వైష్ణవి చైతన్య కూడా ఈ వార్తలపై స్పందిస్తూ తమ మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్‌షిప్ లేదని స్పష్టం చేశారు.

తామిద్దరం మంచి కోస్టార్స్ మాత్రమే కాకుండా మంచి స్నేహితులమని పేర్కొన్నారు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమాయణం లేదని స్పష్టత వచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ జంటపై చర్చ ఆగడం లేదు. బేబీ సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ హిట్ పెయిర్‌ను మరోసారి వెండితెరపై చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తారా అనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో నెలకొంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you