Sunday, November 8, 2026
HomeLATESTJabardasth Priyanka Singh:కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ ప్రియాంక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Jabardasth Priyanka Singh:కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ ప్రియాంక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Jabardasth Priyanka Singh: జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Jabardasth Priyanka Singh:తెలుగు కామెడీ షో జబర్దస్త్ షో కూడా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షో నుంచి ఎంతోమంది కమెడియన్స్ గా, హీరోలుగా ,డైరెక్టర్లుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, బాగానే సక్సెస్ అవుతున్నారు. అలాగే మరి కొంతమంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతూ బాగానే సంపాదించుకున్నారు. అలా సంపాదించుకున్న వారిలో ప్రియాంక సింగ్ (పింకీ)కూడా ఒకరు. జబర్దస్త్ కామెడీ షో లలో లేడీ గెటప్స్ తో అదరగొట్టేస్తూ ఉంటుంది. అలా తన కామెడీతో ఆకట్టుకున్న సాయి తేజ అనంతరం లింగమార్పిడి సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్ గా మారారు.

ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ప్రియాంక సింగ్..

అలా ఎన్నో టీవీ షో లలో సందడి చేసిన ప్రియాంకసింగ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొనింది. తన ఆట,మాట తీరుతో బాగానే ఆకట్టుకుంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

also read:Prabhas:రామాయణంలో రావణుడిగా ప్రభాస్.. చివరి నిమిషంలో ఏమైంది?

సోదర సమానుడైన వ్యక్తి చనిపోయాడు అంటూ పోస్ట్..

ఇందులో ప్రియాంక సింగ్(Jabardasth Priyanka Singh) ఇలా రాసుకొస్తూ ఈరోజు నేను నా ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను.. ఆ వార్త వినగానే నా హృదయం ముక్కలు అయింది. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను.. మీరు ఇకపై మాతో ఉండరని నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.. భగవంతుడా సాధ్యమైతే.. నా స్నేహితుడిని తిరిగి పంపించండి. మేము సృష్టించుకోవాల్సిన కలలు, జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. వంశీ గారు మీరు నాకు ఎప్పుడూ కూడా మంచి స్నేహితులుగా కంటే ఒక అన్న లాగా ఉండేవారు. మనం పంచుకున్న బంధం ఎప్పటికీ మన మనసుకు దగ్గరగానే ఉంటుంది. మీరు లేరనే వార్త విని నా దగ్గర మాటలు రావడం లేదు. మేము మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాము. అది మాటలలో చెప్పలేకపోతున్నాను. అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

- Advertisement -
Advertisement

also read:Srikanth:తన సినీ ప్రయాణంలో జరిగిన ఆసక్తికర విషయాలు బయటపెట్టిన శ్రీకాంత్!

మళ్లీ తిరిగి పంపించు అంటూ పోస్ట్..

సోదర సమానుడైన తన స్నేహితుడిని కోల్పోయానని ప్రియాంక సింగ్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ సైతం ఆమెకు ధైర్యాన్ని చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రియాంక సింగ్ సోదరునికి ఏమయ్యింది? ఎలా చనిపోయారు? అనే విషయం పైన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ప్రియాంక.. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కామెడీ షో లో కూడా పెద్దగా కనిపించలేదు కేవలం సోషల్ మీడియాలోని తరచూ ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు రీల్స్ చేస్తూ ఆ వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇంటర్వ్యూలో కూడా తన సర్జరీ గురించి తెలియజేస్తూ ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎంతో బాధను అనుభవించాను అంటూ తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you