Tollywood:హిందీ, మరాఠీ వంటి సినీ పరిశ్రమలో తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి నేహా పెండ్సే తన వృత్తిపరమైన విషయాలలోనే కాకుండా వ్యక్తిగత జీవిత విషయం పైన కూడా తరచూ నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది. మే ఐ కం ఇన్ మేడం , బాబాజీ ఘర్ పర్ హై వంటి పాపులర్ హిందీ టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నేహా తెలుగు, తమిళ్, మరాఠీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటించి పేరు సంపాదించుకుంది.
2 సార్లు విడాకులు తీసుకున్న వ్యక్తితో పెళ్లికి సిద్ధం..
తెలుగులో(tollywood)సొంతం అనే సినిమాలో చిన్న పాత్రలో నటించింది. 2020లో వివాహం చేసుకోవడంతో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వివాదానికి చర్చకు దారితీసింది. నేహా పెండ్సే 2020 జనవరి ఐదున పూణేకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త శార్దుల్ సింగ్ ను వివాహం చేసుకున్నారు. కానీ ఆమె పెళ్లి చేసుకున్న శార్దూలకు ఇదివరకే రెండుసార్లు వివాహమై కూడా విడాకులు కూడా తీసుకున్నారట . అంతేకాకుండా ఆయన మొదటి, ఇద్దరి భార్యల ద్వారా కూడా ఇద్దరు కుమార్తెలు ఉండడంతో పలువురు నెటిజన్స్ సైతం నేహా పెండ్సే పైన తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని తెలియజేస్తూ ట్రోల్ కూడా చేశారు.
also read:Tammareddy:ఉదయ్ కిరణ్కు అవకాశాలు రాకుండా అడ్డుకున్నారా? తమ్మారెడ్డి ఏమన్నారంటే!
నటిపై ఆగ్రహం..
రెండుసార్లు విడాకులు అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ చాలామంది విమర్శలు కూడా చేశారు. అయితే ఈ ట్రోలింగ్ పైన ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గట్టి కౌంటర్ వేశారు. రెండు వివాహాలు విఫలమైనప్పటికీ శార్దూల్ వివాహ వ్యవస్థ పైన నమ్మకాన్ని కోల్పోలేదని మరొకసారి భాగస్వామిని ఎంచుకోవడంలో ఆయన పాజిటివ్ మైండ్ సెట్ ను గుర్తించారని.. గతంలో విడాకులు కారణం నేరం కాదు అని.. నేటి కాలంలో పెళ్లికి ముందే ఎందరో డేటింగ్ చేసి మరి విడిపోతున్నారు కానీ శార్దూల్ మాత్రం చట్టబద్ధంగాని వివాహం చేసుకొని చట్టబద్ధంగానే విడిపోయారంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది.
also read:Ananya nagalla: దీపావళి పండుగ వేళ మరింత సాంప్రదాయంగా ఆకట్టుకున్న తెలుగమ్మాయి!
నేహా భర్త శార్దూల్ సింగ్ బ్యాక్ గ్రౌండ్..
నేహా భర్త శార్దూల్ సింగ్ మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరు. దాదాపుగా వీరికి 22 కంపెనీలు ఉన్నట్లు సమాచారం. ఈయన ఆస్తి విలువ కూడా మిలియనన్ డాలర్ లు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇవే కోకుండా మరికొన్ని ఆస్తిపాస్తులు ఉన్నట్లుగా కూడా సమాచారం. నేహా పెండ్సే 10 సంవత్సరాల వయసులో కెప్టెన్ హౌస్ అనే సీరియల్ ద్వారా బాలనటిగా తన కెరియర్ ప్రారంభించి, ఆ తర్వాత సినిమాలలో, సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నది. కానీ తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ సంఘటన వల్ల ఈమె పేరు మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి నేహా పెండ్సే తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయానికి పలువురు నేటిజన్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.




