Thursday, November 12, 2026
HomeINTERVIEWSVenky kudumala:తెలుగు సినిమాలు చేయనన్న రష్మిక.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్..!

Venky kudumala:తెలుగు సినిమాలు చేయనన్న రష్మిక.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్..!

Venky kudumala: ప్రముఖ డైరెక్టర్ వెంకీ కుడుముల రష్మిక తెలుగు సినిమాలు చేయనంది అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Venky kudumala:టాలీవుడ్లో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించిన రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే కావడం గమనార్హం. బాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర సంపాదించుకున్న రష్మిక.. కన్నడ ఇండస్ట్రీలో మొదట తన కెరీర్ ని 2016లో వచ్చిన కిర్రిక్ పార్టీ చిత్రం ద్వారా మొదలుపెట్టింది. ఆ తర్వాత కన్నడలో రెండు చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేదు . ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడంతో రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. కానీ రష్మిక తాను మొదట తెలుగు సినిమాలు చేయడానికి ఇష్టపడ లేదని డైరెక్టర్ వెంకీ కుడుముల తాజా ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

తెలుగు సినిమాలతో ఊహించని గుర్తింపు..

రష్మికనీ మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసింది డైరెక్టర్ వెంకీ కుడుమల(Venky kudumala). నాగశౌర్య నటించిన ఛలో చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా. 2018లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత గీతగోవిందం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన రష్మిక వెంకీ కుడుముల దర్శకత్వంలోనే మళ్లీ భీష్మ సినిమా చేయగా.. అందులో కూడా హీరోయిన్గా నటించి భారీ విజయాన్ని అందుకుంది రష్మిక. ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించి స్టార్ స్టేటస్ అందుకుంది.

- Advertisement -
Advertisement

also read:Babu mohan:ప్యారడైజ్ టీమ్ నన్ను మోసం చేసింది.. అందుకే ఫ్లాప్.. బాబు మోహన్ కామెంట్స్..!

కానీ ఆసక్తి చూపించని రష్మిక..

డైరెక్టర్ వెంకీ కుడుముల తాజాగా నిర్మాతగా నిర్మించిన చిత్రం ఇట్లు అర్జున. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ కుడుముల చెన్నైలో స్క్రిప్ట్ రాసుకోవడానికి కొంతమంది ఆర్టిస్టులను కలవడానికి వెళ్లాను. అక్కడే తాను కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రాన్ని చూశాను. అందులో రష్మిక చాలా అద్భుతంగా నటించింది. బాగా ఉంది. దీంతో నాగశౌర్యకు ఫోన్ చేసి ఇలా ఒక అమ్మాయిని చూశాను అంటే నాగశౌర్య కూడా నేను ఒక అమ్మాయిని చూశానని వీడియో సాంగులో తాను ఆ సాంగ్ పంపించారు.. నేను కూడా అదే సినిమాను చూడమని చెప్పాను.. ఇద్దరం కలిసి ఒకే హీరోయిన్ పేరే అనుకున్నాం ఆమె రష్మిక అంటూ తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Poonam Kaur:పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్..!

వెంకీ మాట నిజమైందిగా..

దీంతో వెళ్లి రష్మికను వెళ్లి కలవగా తెలుగు సినిమాలలోకి రావడానికి ఆమె పెద్దగా మక్కువ చూపలేదు. తెలుగు సినిమాలు చేయనుంది. అప్పుడే మొదటి కన్నడ సినిమాలో నటించాను. అప్పుడే కర్ణాటక దాటి వెళ్లిపోవాలా అనే ఆలోచనలో ఉండేది.. అక్కడ ఎలా ఉంటుందో అని భయపడిందని, కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం కథ చెప్పి ఒప్పించారు. బాగుంది బాగా చూసుకుంటామని చెప్పి మరి ఒప్పించామని , ఆ అమ్మాయిని సినిమాకు ఓకే చేశాక ఫోటోషూట్ అవ్వగానే నా ఇంస్టాగ్రామ్ లో.. “నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ టాలీవుడ్” అని పెట్టాను. ప్రస్తుతం అది నిజమయ్యింది అంటూ తెలియజేశారు డైరెక్టర్ వెంకీ కుడుముల.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you