Thursday, November 12, 2026
HomeLATESTIdupukayitham:ఇడుపు కాయితం.. టీజర్ రిలీజ్..!

Idupukayitham:ఇడుపు కాయితం.. టీజర్ రిలీజ్..!

Idupukayitham: ప్రియదర్శి నాగ దుర్గ కాంబినేషన్లో డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇడుపు కాయితం మూవీ నుండి టీజర్ రిలీజ్ చేశారు.

on
- Advertisement -banner Ad

Idupukayitham:టాలీవుడ్లో విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించే హీరోలలో హీరో ప్రియదర్శి కూడా ఒకరు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఇడుపు కాయితం. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రేక్షకులకు మరింత ఆసక్తిని పెంచేసింది. అంతేకాకుండా ఎన్నో వివాదాలు కూడా ఈ టైటిల్ చుట్టూ వినిపించాయి. ఇప్పుడు తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.. ప్రేమ, పెళ్లి, కుటుంబ అనుబంధాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వంటి అంశాలను ఈ టీజర్ లో చూపించడం అందరిని ఆకట్టుకుంది.

ఇడుపు కాయితం టీజర్ రిలీజ్.

ముఖ్యంగా పెళ్లితో మొదలైన కథ చివరకు విడాకుల పత్రం దగ్గర చేరడంతో ఈ సినిమా పైన మరింత ఆసక్తిని పెంచేలా చేస్తోంది. టీజర్ విషయానికే వస్తే.. రామాయణం ఎక్కడ ఆగిపోతుందో అనుకుంటాము. అక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి రామాయణం ముందుకు వెళుతుంది అంటూ ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన మాటలతోనే ఈ టీజర్ మొదలవుతుంది.. కథలో శ్రీలత పాత్రకు చాలా ప్రాధాన్యత చూపించారు. ఆ తర్వాత ప్రేమ, కామెడీ, పెళ్లి, కుటుంబం ఎమోషనల్ కథనం మరింత ఆసక్తి కలిగించేలా చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ వాతావరణం , పల్లెల్లో సహజమైన సంభాషణల విషయాలను కూడా ఈ టీజర్ లో చాలా చూపించారు.

- Advertisement -
Advertisement

also read:Samantha:సమంత జీవితంపై మరో రూమర్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

ఆకట్టుకుంటున్న కథాంశం..

ఇడుపు కాయితం సినిమాలో ప్రియదర్శి శ్రీను పాత్రలో, నాగదుర్గ శ్రీలత పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి పరిచయం , ప్రేమా, పెళ్లిచూపులు, వివాహం వంటి అంశాలను టీజర్ లో చాలా సరదాగానే చూపించారు. పెళ్లి తర్వాత కొత్తజంట జీవితంలో చోటుచేసుకొనే చిన్న చిన్న సంఘటనలు, కుటుంబాలతో అనుబంధాలు, భార్యాభర్తల మధ్య సరదా సంభాషణ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అంతేకాకుండా కథలో ట్విస్ట్ మాత్రం చివరిలో చూపిస్తారు. పెళ్లి తో ఒకటైన శ్రీను, శ్రీలత చివరకు విడాకుల పత్రం వరకు ఎందుకు వెళ్తారు? అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది? అని ప్రశ్నలను టీజర్ లో లేవనెత్తారు.

- Advertisement -
Advertisement

also read:Shekhar Master:శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

డిసెంబర్ 11న థియేటర్లలోకి..

ఇడుపు కాయితం(Idupukayitham) అంటే విడాకుల పత్రం అనే అర్థం కావడంతో టైటిల్కు తగ్గట్టుగానే ఈ సినిమా కథలో అంశాన్ని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియదర్శి బలగం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు . ఎక్కువగా కంటెంట్ ఉండే పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ కథలు ఎంచుకొని ముందుకు వెళ్తున్నారు. మరొకవైపు తెలంగాణ జానపద పాటలతో గుర్తింపు సంపాదించుకున్న నాగదుర్గ ఈ సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. శ్రీలత పాత్రలో కూడా ఆమె నటన అద్భుతంగా ఉన్నది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా విడుదలైన బారత్ బాజా సాంగులో కూడా నాగ దుర్గ వేసిన మాస్ స్టెప్పులు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తూ ఉండగా సుకుమార్ రైటింగ్ అందించారు. డిసెంబర్ 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you