Monday, November 16, 2026
HomeLATESTAshika Ranganath:జిమ్‌లో అందాల ఆరబోత.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఆషిక రంగన్నాథ్..!

Ashika Ranganath:జిమ్‌లో అందాల ఆరబోత.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఆషిక రంగన్నాథ్..!

Ashika Ranganath:జిమ్‌లో చెమటోడుస్తూ కష్టపడుతున్న ఈ బ్యూటీ.. మరోవైపు తన గ్లామరస్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ తన అందాన్ని మరింత మెరుగుపరుచుకుంటోంది.

on
- Advertisement -banner Ad

Ashika Ranganath:సినిమాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోయిన్లలో ఆషిక రంగన్నాథ్ ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లోనూ వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. తన నటనతోనే కాకుండా, అందం, ఫిట్‌నెస్, గ్లామరస్ ఫొటోషూట్లతోనూ సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తోంది. ముఖ్యంగా జిమ్‌లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటోంది. తాజాగా ఆమెకు సంబంధించిన జిమ్ ఫొటోలు, వీడియోలు నెట్టింట చర్చనీయాంశంగా మారుతున్నాయి.

కన్నడ నుంచి టాలీవుడ్ వరకు..:

ఆషిక రంగన్నాథ్ 2016లో విడుదలైన కన్నడ చిత్రం ‘క్రేజీ బాయ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘ముగులు నగే’, ‘రాంబో 2’, ‘రాజు కన్నడ మీడియం’, ‘తాయిగే తక్క మగ’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘రాంబో 2’ సినిమా ఆమె కెరీర్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

- Advertisement -
Advertisement

ఇక తెలుగులో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఇషిక పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత కింగ్ నాగార్జున సరసన ‘నా సామి రంగ’ సినిమాలో వరాలు పాత్రలో నటించి మరింత గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాలో తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

also read:Tollywood:రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరిన దర్శకులు వీళ్లే.. టాలీవుడ్ నుంచి ఒక్కడే!

- Advertisement -
Advertisement

చిరంజీవి, రవితేజ సినిమాలతో మరింత క్రేజ్:

ఆషిక9Ashika Ranganath) కెరీర్‌లో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో ఆమె భాగమైంది. అలాగే తమిళంలో ‘మిస్ యూ’, కన్నడలో ‘ఓ2’, ‘గత వైభవ’ వంటి చిత్రాల్లోనూ నటించింది. విభిన్న భాషల్లో సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను విస్తరించుకుంటోంది.

also read:Master Bharath:డాక్టర్‌గా సెటిల్ అయిన మాస్టర్ భరత్.. సినిమాలపై సంచలన కామెంట్స్!

- Advertisement -
Advertisement

జిమ్‌లో హార్డ్ వర్క్.. అందంతో కట్టిపడేస్తోంది:

సినిమాల్లో ఎంత గ్లామరస్‌గా కనిపించినప్పటికీ, ఆ ఫిట్‌నెస్ వెనుక ఎంతో కష్టపడుతుంటుంది ఆషిక. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా జిమ్‌కు సమయం కేటాయిస్తూ వర్కౌట్స్ చేస్తుంటుంది. రన్నింగ్, స్క్వాట్స్, వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలతో తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటోంది. గతంలోనూ తన ఇంటెన్స్ జిమ్ సెషన్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

జిమ్‌లో చెమటోడుస్తూ కష్టపడుతున్న ఈ బ్యూటీ.. మరోవైపు తన గ్లామరస్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ తన అందాన్ని మరింత మెరుగుపరుచుకుంటోంది. దీంతో ఆషిక లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు ఆమె అందం, ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి సినిమాలతో బిజీగా ఉంటూనే ఫిట్‌నెస్ విషయంలోనూ ఏమాత్రం తగ్గేదేలే అంటోంది ఈ కన్నడ సుందరి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you