kangana ranaut:బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన కంగనా రనౌత్ నిరంతరం ఏదో ఒక వార్తలలో ఈమె పేరు వినిపిస్తూ ఉంటుంది. ఎలాంటి విషయాలను అయినా సరే మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి బిజెపి ఎంపీగా గెలిచిన తర్వాత ఎక్కువగా ఈమె వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత పేరు వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా ఇమే మరొకసారి చిక్కుల్లో ఎదుర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.
గాంధీ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ కంగన విమర్శలు..
కంగనా రనౌత్(kangana ranaut).. గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో హిమాచల్ ప్రదేశ్‌లో పోలీసులు సైతం ఆమె పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. నవంబర్ 13వ తేదీన షిమ్లాలోని బోయిలేయుగంజ్ పోలీస్ స్టేషన్లో ఈమె పైన కేసు నమోదు అయినట్లుగా అధికారులు సైతం వెల్లడించారు.. ఈ వివాదానికి అసలు కారణం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆవిష్కరించిన ఆమె ఆత్మ కథ పుస్తకమే అన్నట్లుగా వినిపిస్తున్నాయి. అందులో మొత్తం 554 పేజీలు ఉన్న ఈ పుస్తకంలో ఇటలీలో తన బాల్యం, 1965 లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ పై రాజీవ్ గాంధీతో పరిచయం, ప్రేమ, వివాహ బంధం, ఇండియాకి రావడం తోపాటుగా మరికొన్ని అంశాలను అందులో రాసుకున్నారు.
also read:Ramya Krishna:రమ్యకృష్ణ విడాకులపై క్లారిటీ.. భర్తతో కలిసి ఉండటం లేదంటూ షాకింగ్ కామెంట్స్!
సోనియా గాంధీ ఆత్మకథ పై కూడా విమర్శలు..
ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లతో గడిపిన అనుభవాలను అలాగే పలు రాజకీయ అంశాల పైన కూడా సోనియా గాంధీ వివరించడం జరిగింది. అయితే ఈ పుస్తకం విడుదలైన రోజే నవంబర్ 10వ తేదీన కంగనా రనౌత్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి గాంధీ కుటుంబం భోజనం చేస్తున్న పాత వీడియోని పంచుకుంటూ వరుసగా విమర్శలు చేశారు.. ఆ పోస్టులో సోనియాగాంధీ రహస్య విదేశీ పౌరురాలు అంటూ కంగనా రనౌత్ అభివర్ణించడంతో పాటుగా ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీల మరణాల చుట్టూ ఉన్న పరిస్థితుల పైన ఆమె అనుమానాలను రేకెత్తించేలా కొన్ని పోస్టులు షేర్ చేశారు. అంతేకాకుండా రాహుల్ గాంధీని కూడా లక్ష్యంగా చేసుకొని ఈమె విమర్శలు చేసినట్లు సమాచారం.
ALSO READ:Jabardasth Babu:త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్!
పలు సెక్షన్ల కింద కంగనాపై కేసు ఫైల్
కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యల పైన షిమ్లాకు చెందిన రిటైర్డ్ కెప్టెన్ అతుల్ శర్మ డీజీపీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. రాజకీయ విమర్శల పరిధిని దాటి ప్రజల మధ్య కొన్ని విద్వేషాలను సృష్టిస్తూ, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తోందని అలాగే శాంతి భద్రతలకు విగాథం కలిగించేలా కంగనా రనౌత్ పోస్టులు ఉన్నాయంటూ తన ఫిర్యాదులో సైతం తెలియజేశారు. అంతేకాకుండా ఆ డిజిటల్ ఆధారాలను భద్రపరిచి సైబర్ ఫారంసిక్ విచారణ జరిపించాలంటూ కోరడం జరిగింది. దీంతో కంగనా రనౌత్ పై.. సెక్షన్ 196, సెక్షన్ 353, సెక్షన్ 356 వంటి వాటి కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ చాలామంది ఈమె పైన నేతలు విమర్శిస్తున్నారు. మరి వీటి పైన ఎలా స్పందిస్తుందో చూడాలి కంగనా రనౌత్.




