Tollywood:తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరోలు వరుసగా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరి కొంతమంది పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా తమ అభిమానుల హీరో సినిమా విడుదల అవుతుందంటే చాలు అభిమానులు చేసే హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కలెక్షన్స్ డేస్ విషయంలో సరికొత్త రికార్డుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా తెలుగు సీనియర్ హీరోలలో ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉందనే విషయంపై అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది.
టాలీవుడ్ హీరోలలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎవరికంటే?
టాలీవుడ్(Tollywood) లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కాకా, విశ్వంభర వంటి చిత్రాలలో నటిస్తున్నారు. ఒక చిత్రానికి ప్రస్తుతం 40 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక షోకి చిరంజీవి ఒక్కో ఎపిసోడ్ కి 10 కోట్ల రూపాయల వరకు తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
also read:Kajal Aggarwal:14 ఏళ్ల ప్రేమ.. మధ్యలో బ్రేకప్.. పెళ్లికి ముందు కాజల్ పెట్టిన కండిషన్ ఇదే!
ఒక్కొక్కరి రెమ్యూనరేషన్ ఎంతంటే?
మరొకవైపు సీనియర్ హీరోలలో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న హీరోలలో బాలకృష్ణ కూడా ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఒక్కో చిత్రానికి 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న దాదా సినిమా కోసం మరింత పెంచినట్లుగా వినిపిస్తున్నాయి. బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షో కి మొదటి సీజన్ కి రూ .4 కోట్ల రూపాయలు తీసుకోగా.. రెండవ సీజన్ కి రూ.6 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
also read:kangana ranaut:కంగనా రనౌత్ పై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏం జరిగిందంటే..?
నాగార్జున రెమ్యూనరేషన్..
అక్కినేని నాగార్జున కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒక్కో చిత్రానికి రూ .15 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం, అయితే నాగార్జున నటిస్తున్న తన 100వ సినిమా కింగ్ కోసం 20 కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటున్నట్లు సమాచారం. నాగార్జున బిగ్ బాస్ షో కి ఒక్కో సీజన్ కి రూ.35 నుంచి 40 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
హైయెస్ట్ ఆయనకే..
విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఆదర్శ కుటుంబం సినిమా ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న వెంకటేష్ ఒక చిత్రానికి రూ.15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే ఆదర్శ కుటుంబం సినిమా కోసం రూ .20 కోట్లు తీసుకున్నట్టుగా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదల సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.మొత్తానికి సీనియర్ హీరోలలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా మెగాస్టార్ చిరంజీవి నిలవడం గమనార్హం.




