Anupama parameswaran:సినీ ఇండస్ట్రీలో త్వరలో విడుదల కాబోతున్న భోగి సినిమా చుట్టూ రోజుకొక వార్త వినిపిస్తూనే ఉంది.. ముఖ్యంగా హీరో శర్వానంద్, మరొక హీరోయిన్ డింపుల్ హయతి గురించి ఏదో ఒక విషయం వైరల్ గా మారింది.. అయితే ఇప్పుడు తాజాగా ఇందులో నటించిన మెయిన్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి కూడా మరొక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇటీవల జరిగిన సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో అనుపమ కనిపించకపోవడంతో తీవ్ర చర్చనీయాంశం కు దారితీసింది.
భోగి ప్రమోషన్లకు అనుపమ దూరం..క్లారిటీ ఇచ్చిన అనుపమ..
అసలు ఎందుకు అనుపమ ఈ కార్యక్రమాలకు హాజరు కాలేదంటూ సోషల్ మీడియాలో చాలా ప్రశ్నలు వేస్తున్నారు నేటిజన్స్. అయితే ఈ విషయం పైన తాజాగా అనుపమనే క్లారిటీ ఇచ్చింది. భోగి సినిమా ఈవెంట్ కి అనుపమ (Anupama parameswaran)హాజరు కాకపోవడానికి ముందుగా తనకి ఉన్న షూటింగ్ కమిట్మెంట్స్ గురించి వెల్లడించింది.. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్టుని షేర్ చేయగా.. సినిమా ప్రయోజనం కోసం షూటింగ్ తేదీలలో వచ్చిన పలుమార్పులకు అనుగుణంగానే సర్దుబాటు చేసేందుకు తాను చాలా ప్రయత్నించానని, కానీ చివరకు తన గతంలోనే ఖరారైన ఇతర సినిమా పనుల కారణం చేత ఊటీలో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చింది ‘ అంటూ క్లారిటీ ఇచ్చింది.
also read:ACTOR SREEJITH RAVI:బాలికలతో నటుడు అసభ్యకర ప్రవర్తన..కోర్టు తీర్పు ఏమిటంటే..?
చిత్ర బృందానికి ధన్యవాదాలు..
ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని తనకు సహకరించిన భోగి చిత్ర బృందానికి కూడా ప్రత్యేకించి మరి ధన్యవాదాలు తెలిపింది అనుపమ. తాను సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేకపోయిన తన మనసంతా కూడా చిత్ర బృందంతోనే ఉందంటూ వెల్లడించింది. ప్రేక్షకులు బోగి చిత్రాన్ని థియేటర్లో చూసే రోజు కోసం తాను కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపింది. దీంతో మొత్తానికి భోగి సినిమా ఈవెంట్లకు రాకపోవడంపై అనుపమ పైన జరుగుతున్న చర్చకు పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు.
also read:Mirchi Madhavi:ప్రకాశ్ రాజ్ భార్య పాత్ర కోసం అలాంటి డిమాండా? మిర్చి మాధవి షాకింగ్ కామెంట్స్
భోగి.. నవంబర్ 27న విడుదల..
భోగి సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగే రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా చిత్రం గా డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్ , సాంగ్స్ కూడా ప్రేక్షకులలో మరింత అంచనాలను పెంచేశాయి. నవంబర్ 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని 18 ఏళ్లు దాటిన వారు మాత్రమే చూడాల్సి ఉంటుంది. సినిమా నిడివి రెండు గంటల 34 నిమిషాలు ఉంటుంది. ఇప్పటివరకు నటించిన చిత్రాల కంటే భోగి సినిమాలో శర్వానంద్ చేసిన పాత్ర చాలా భిన్నమైన పాత్రగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. ఈ సినిమాకి డింపుల్ హయతి మరింత గ్లామర్ ని జోడించనున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమాతో శర్వానంద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి మరి.




