Aadarsha kutumbam AK 47:విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమా పైన అంచనాలను పెంచేసి తాజాగా ఈ సినిమా నుంచి అందరు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ట్రైలర్ రిలీజ్ అయింది. ఆదర్శ కుటుంబం ట్రైలర్ విషయానికి వస్తే.. నారా రోహిత్ సీన్ తోనే ప్రారంభం అవుతుంది. రావు రమేష్ ని RF కు ఎందుకు కాల్ చేసావని ప్రశ్నించగా. దొంగలను పట్టుకోవడానికి సార్ అంటూ రావు రమేష్ సమాధానాన్ని చెబుతారు.
ఆదర్శ కుటుంబం నుండి ట్రైలర్ రిలీజ్..
ట్రైలర్ గమనిస్తే ఇది పక్కా ఫ్యామిలీ ఎమోషన్ మాస్ కామెడీ హై వోల్టేజ్ థ్రిల్లర్ సినిమాగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ స్టైల్ లో సాగే లోతైన ఆలోచింపజేసే సంభాషణ ట్రైలర్ అన్నట్లుగా కనిపిస్తోంది. విక్టరీ వెంకటేష్ చెప్పే డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు. ట్రైలర్ లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 30వ తేదీన రాబోతోంది. మరి ఈ సినిమా ఏ
రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
also read:Deepthi Sunaina:సిల్క్ శారీలో దీప్తి సునయన గ్లామర్ షో.. చూపులతోనే కుర్రాళ్లకు కిక్కు!
అక్టోబర్ 30న థియేటర్లలో కలుద్దాం..
ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam AK 47) ట్రైలర్ వేడుకలలో త్రివిక్రమ్ మాట్లాడుతూ ఈ సినిమా మీరు ఊహించిన పద్ధతిలో కాకుండా వేరే డైరెక్షన్లో చేసే అవకాశం ఉన్న సినిమా అని, నార్మల్ రొటీన్ కామెడీ కాకుండా వేరే అంశాలను కూడా డిస్కస్ చేశామని క్రైమ్ కామెడీ లేదా బ్లాక్ కామెడీ అలాంటివి ట్రై చేశామంటూ తెలిపారు. ఈ చిత్రానికి పనిచేసిన అందరికీ కూడా ప్రత్యేకించి థాంక్స్ చెప్పారు. వెంకటేష్ గారితో కూడా మొదటిసారి ఇలాంటి సినిమాలు ట్రై చేశాను అక్టోబర్ 30న థియేటర్లో కలుద్దాం అంటూ తెలిపారు.
also read:kajal agarwal :రామాయణం సినిమాలో కాజల్ అగర్వాల్ ఉందా? లేదా..?
ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ అవుతారు- శ్రీనిధి శెట్టి
శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. ఇలా స్టూడెంట్స్ మధ్య ఈ వేడుక చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనకి లైఫ్ లో ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. కానీ లైఫ్ ప్లాన్ మరొక లాగా ఉంటుంది. మన వల్ల సర్ప్రైజ్ చేసేలా ఉంటుంది. అలాగే మా సినిమాలో కూడా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే సీన్ కోసం ప్రతి ఒక్కరు ఆసక్తికరంగా ఎదురు చూస్తారు. ప్రతి సీన్ ఒక సర్ప్రైజింగ్ గానే ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను అంటూ తెలిపారు.
20 ఏళ్ల తర్వాత వెంకటేష్ – త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా ఆదర్శ కుటుంబం కావడంతో ఈ సినిమా పైన అంచనాలను పెంచేసింది. క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో కూడిన పూర్తిస్థాయి కామెడీ సినిమా అన్నట్టుగా ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. ఈ చిత్రంలో నివేదా పేతురాజు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరు నటీనటులు కీలకమైన పాత్రల నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని వెంకటేష్ త్రివిక్రమ్ అందుకుంటారో చూడాలి మరి. ప్రస్తుతమైతే ట్రైలర్ వైరల్ గా మారింది.




