Saturday, October 24, 2026
HomeLATESTFauzi:ఫౌజీ సినిమా గ్లింప్స్ వైరల్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ప్రభాస్..!

Fauzi:ఫౌజీ సినిమా గ్లింప్స్ వైరల్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ప్రభాస్..!

Fauzi: ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఫౌజీ మూవీ నుండి గ్లింప్స్ విడుదల చేశారు.

on
- Advertisement -banner Ad

Fauzi:పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హాను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైడెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం ఫౌజీ. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పైన అంచనాలను, మరింత క్యూరియాసిటీ పెంచేసాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పవర్ఫుల్ వీడియోను కూడా విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు.

ఫౌజీ నుండి గ్లింప్స్ రిలీజ్..

ఫైల్ నెంబర్ 25: ఫౌజీ(Fauzi) అనే పేరుతో ఈ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ క్లిప్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే ఒక సంభాషణ కథతో మొదలవుతుంది. బ్రిటిష్ వారిని ఓడించడానికి జర్మనీ సహాయం కోరడానికి వెళ్లిన సుభాష్ చంద్రబోస్ తో హిట్లర్ మాట్లాడే సీన్ మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇండియాలో బానిసత్వం ఉందని , యుద్ధంలో గెలవడం కష్టమని హిట్లర్ అంటుండగా, ఇంటిలిజెన్స్ గురించి బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఒకే ఒక్క సైనికుడు గురించి బోస్ వివరిస్తూ ఉంటారు. బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సైనికుడిని ఫౌజీ అని పిలుస్తారని , భగవద్గీత ఆధారంగా అతడు సృష్టించిన కోడ్ ఎనిగ్మా కంటే చాలా ప్రమాదకరమైనదని బోస్ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

- Advertisement -
Advertisement

also read:Aadarsha kutumbam AK 47:ఆకట్టుకుంటున్న వెంకటేష్ ఆదర్శ కుటుంబం ట్రైలర్..!

సినిమాపై అంచనాలు పెంచేసిన టీం..

అనంతరం చివరిలో ప్రభాస్ ని మాస్ ఎంట్రీ చూపించి.. బ్రిటిష్ అధికారులను హెచ్చరిస్తూ చెప్పే డైలాగ్ కూడా ఫౌజీ సినిమా పైన మరింత అంచనాలను పెంచేసింది. కేవలం గ్లింప్స్ తోనే సినిమా పై హైప్ క పెంచేసిన చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించేశారు. ఈ చిత్రం 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తూ ఉండగా విజువల్స్ మాత్రం హాలీవుడ్ స్థాయిలో కనిపిస్తున్నాయి. చివరిలో ప్రభాస్ ను చూపించిన తీరు కూడా అభిమానులను మరింత ఆకట్టుకుంది.

- Advertisement -
Advertisement

also read:Deepthi Sunaina:సిల్క్ శారీలో దీప్తి సునయన గ్లామర్ షో.. చూపులతోనే కుర్రాళ్లకు కిక్కు!

ప్రభాస్ తదుపరి సినిమాలు..

ప్రభాస్ తదుపరి సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా మరింత వైలెన్స్ గా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్లో సలార్ 2 సినిమా షూటింగ్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న కల్కి 2 సినిమాకి సంబంధించి నిన్నటి రోజున అప్డేట్ ప్రకటించారు. మొత్తానికి సినిమా అప్డేట్లతో ప్రభాస్ అభిమానులను మాత్రం ఫుల్ ఖుషి చేశారని చెప్పవచ్చు. మరి ఈ చిత్రాలతో ఎలాంటి రికార్డులను ప్రభాస్ తిరగరాస్తారో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you