Thursday, August 13, 2026
HomeLATESTRishika Singh:యశ్ కర్ణాటక వదిలి వెళ్ళిపోవాలి.. హీరోయిన్ కామెంట్స్..!

Rishika Singh:యశ్ కర్ణాటక వదిలి వెళ్ళిపోవాలి.. హీరోయిన్ కామెంట్స్..!

Rishika Singh: టాక్సిక్ మూవీపై హీరోయిన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Rishika Singh:కన్నడ హీరో యశ్ తాజాగా నటిస్తున్న చిత్రం టాక్సిక్. ఈ చిత్రాన్ని మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 26వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమా పైన అంచనాలను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టాక్సిక్ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా హీరో యశ్ హాలీవుడ్ రేంజ్ లో కనిపిస్తున్నారని సినిమా కూడా హాలీవుడ్ స్థాయిలోనే ఉందంటూ ప్రశంసలు వినిపించాయి.

టాక్సిక్ సినిమాపై హీరోయిన్ విమర్శలు..

గతంలో విడుదలైన ట్రైలర్, టీజర్ లో బోల్డ్ సీన్స్ , హింస మోతాదుకు మించి ఉందంటూ చాలానే విమర్శలు వినిపించాయి.. ముఖ్యంగా కియారా సాంగ్ పై కూడా చాలానే విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి రిషికా సింగ్ టాక్సిక్ సినిమా పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్లో చూపించిన బోల్డ్ సీన్స్ పైన ఆమె అభ్యంతరాన్ని తెలియజేసింది. టాక్సిక్ ట్రైలర్ లో చూపించిన రొమాంటిక్ బోల్డ్ సీన్స్ నన్ను చాలా తీవ్ర నిరాశకు గురి చేశాయని తెలిపింది.

- Advertisement -
Advertisement

also read:Kamakshi Bhaskarla:పొలిమేర సినిమాలో నటించడం తప్పా.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్!

యశ్ కన్నడ ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోవాలంటూ డిమాండ్..

యశ్ కూడా ఒక భర్తగా, తండ్రిగా మహిళల పట్ల చాలా గౌరవంగా చూపాలని ఆశిస్తున్నాను.. మహిళలను గౌరవించకపోతే ఆయన కర్ణాటక నుంచి వెళ్లిపోవాలంటూ హెచ్చరించింది హీరోయిన్ రిషికా సింగ్( Rishika Singh). చివరగా నేను కూడా టాక్సిక్ అంటూ కామెంట్స్ చేసింది. ఈ విషయం పైన యశ్ అభిమానుల సైతం తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆమెపైన పలు రకాల విమర్శలు చేస్తూ తిప్పికొడుతున్నారు. ఈ సమయంలోనే రిషిక గతంలో నటించిన పలు సినిమాల ఫోటోషూట్లకు సంబంధించి బోల్డ్ క్లిప్స్ కు సంబంధించి కొన్ని షేర్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Shakeela:ఫోన్ వల్ల రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్న షకీలా..!

టాక్సిక్ మూవీ విశేషాలు..

టాక్సిక్ చిత్రంలో హీరోయిన్స్ గా కియారా అద్వాని, నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి నటిస్తున్నారు. ఈ సినిమా కూడా పెద్దల కోసమే అంటూ మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు. కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లోనే నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. ఏది ఏమైనప్పటికీ భారీ అంచనాల మధ్య హీరో యశ్ సినిమా చాలా ఏళ్ల తర్వాత విడుదల కాబోతుండడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. అలాగే ఈ ఏడాది దీపావళి సందర్భంగా రామాయణ సినిమా విడుదల కాబోతోంది. ఇందులో యశ్ రావణుడుగా నటిస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you