Kamakshi Bhaskarla:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదట తన కెరియర్ ను మొదలుపెట్టి, ఆ తర్వాత పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించింది నటి కామాక్షి భాస్కర్ల. ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తోంది. ముఖ్యంగా ఈమె కెరీర్ కు బాగా టర్నింగ్ పాయింట్ అయిన చిత్రాలలో పొలిమేర, పొలిమేర 2 వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అగధ. ఈ చిత్రం రేపటి రోజున (ఆగస్టు 14) భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు.
వరుస ఇంటర్వ్యూలతో జోరు పెంచిన కామాక్షి..
సోషియో ఫాంటసీ నేచురల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రంలో శ్రావణ్ రెడ్డి, జోవిక విజయ్ కుమార్, రోషన్ బహిర్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా సినిమా పైన మరింత అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం పాల్గొనుంది. ఇందులో కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla)కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినీ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న విషయాలు , ఇబ్బందుల గురించి అభిమానులతో పంచుకుంది.
also read:Shakeela:ఫోన్ వల్ల రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్న షకీలా..!
సత్యం రాజేష్ పక్కన నటించానని.. పెద్ద సినిమాలో వద్దన్నారు..
కొన్ని చిత్రాలు డబ్బులు కోసం చేస్తాము.. మరికొన్ని సినిమాలు మనల్ని మనం సంతృప్తి పరుచుకునేందుకే చేస్తాము.. తాను నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని పొలిమేర, అగధ వంటి చిత్రాలకి సూట్ అవుతానని చాలామంది అనుకుంటున్నారు. అందుకే నేను వాటికి బ్రేక్ ఇచ్చాను.. మన సినీ ఇండస్ట్రీలో చిన్న హీరోలు, చిన్న సినిమాలు చేసే వాళ్లకు పెద్ద చిత్రాలలో అంత తొందరగా అవకాశాలు రావు.. తాను పొలిమేర చిత్రంలో సత్యం రాజేష్ పక్కన నటించానని ఒక పెద్ద సినిమాని రిజెక్ట్ చేశారని తెలిపింది. సత్యం రాజేష్ పక్కన నటించిన ఆ అమ్మాయి వద్దని కొందరు అన్న మాటలు తనవరకు వచ్చాయని.. ఇక్కడ ఎవరి పక్కన చేస్తున్నామో కూడా ఇండస్ట్రీలో గమనిస్తున్నారని అది చాలా తప్పు.. ఇలా చాలా సినిమాలలో నన్ను రిజెక్ట్ చేశారని తెలిపింది కామాక్షి భాస్కర్ల.
also read :Movies:ఆగస్టు 14న థియేటర్లలోకి 5 సినిమాలు.. ఏ సినిమా హిట్? ఏది ఫట్?
అగధ పై కామాక్షి కామెంట్..
ఇలా చేయడం చాలా తప్పు అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది కామాక్షి భాస్కర్ల.అగధ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఎక్కువగా హర్రర్ మూమెంట్స్ ఉండవు కానీ చాలా థ్రిల్లింగ్ కి గురి చేస్తుందని, అగధ చిత్రం ఒక డివైన్ ఫీలింగ్ కలిగిస్తుందని, నేను చేసిన సినిమాలలో జోనర్స్ రిపీట్ అవుతున్నప్పటికీ పాత్రలు మాత్రం కొత్తగానే ఉంటాయని తెలియజేసింది. ప్రస్తుతం కామాక్షి భాస్కర్ల చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. మరి అగధ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని స్టార్ హీరోల చిత్రాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.




