Friday, October 30, 2026
HomeLATESTBigg Boss 10:ఈవారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఎలిమినేట్ తప్పదా..?

Bigg Boss 10:ఈవారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఎలిమినేట్ తప్పదా..?

Bigg Boss 10: తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 లో 8వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

on
- Advertisement -banner Ad

Bigg Boss 10:ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 చాలా హోరా హోరిగానే కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రేక్షకులకు అదిరిపోయేలా ట్విస్టులు ఇస్తున్నారు బిగ్ బాస్. ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా పోటాపోటీగానే అన్నిటిలో పోటీపడుతున్నారు. ఫిజికల్ టాస్క్ లలో, గేమ్స్లలో కూడా సై అంటూ సై అనేలా తలపడుతూ ఉన్నారు. ఎప్పటిలాగే ఈవారం కూడా బిగ్బాస్ హౌస్లో చాలా డిఫరెంట్గా కనిపించింది. కంటెస్టెంట్స్ పోటీపడి ఆడినా.. గొడవలకు దూరంగా ఉన్నప్పటికీ నామినేషన్ లో మాత్రం పెద్దగా మాటల తూటాలు ఎక్కడ పేల్చినట్లు కనిపించలేదు. ఈ వారం మాత్రం కంటెస్టెంట్స్ మధ్య హౌస్ లో చాలా సందడి సందడిగానే మారిపోయింది.

డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే?

అయితే ఈసారి మాత్రం గత వారంలాగే ఇప్పుడు కూడా డబుల్ ఎలిమినేషన్(Bigg Boss 10) ఉంటుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కంటెస్టెంట్లలో ఒక్కసారిగా భయం మొదలైంది. ఈ వారం నామినేషన్లలో రోహిత్, వంశీ, రాంప్రసాద్, ఝాన్సీ, శివ, యాంకర్ వర్షిని, సుధీర్, రామకృష్ణ ఉన్నారు. మొత్తం ఎనిమిది మంది ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వీటికి తోడు ఈ వారం ఎవరిపైన కూడా పెద్దగా నెగిటివ్ రాలేదు. దీంతో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంపై అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Killer Movie Review:ఏలియన్, ఏఐ, సైన్స్ ఫిక్షన్.. కిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

సేఫ్ జోన్లోకి వచ్చిన రాంప్రసాద్, వర్షిణి

ప్రస్తుతం ఓటీటీ ట్రెండును ఒకసారి పరిశీలిస్తే మాత్రం.. ఊహించిన విధంగా టెంపర్ వంశీ టాప్ ప్లేస్ లో కనిపిస్తూ ఉండడం గమనార్హం. రెండవ ప్లేస్ లో రోహిత్ ఉండగా.. మూడవ ప్లేసులో సుధీర్ కనిపిస్తున్నారు. అలాగే నాలుగవ స్థానంలో ఝాన్సీ ఉండగా.. ఐదవ స్థానంలో జబర్దస్త్ రాంప్రసాద్ ఉన్నారు, ఆరో స్థానంలో శివ, ఏడవ స్థానంలో రామకృష్ణ చివరిగా యాంకర్ వర్షిని ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. దీని బట్టి చూస్తూ ఉంటే రామకృష్ణ, యాంకర్ వర్షిని డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పవచ్చు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేషన్ అయితే మాత్రం.. ఇద్దరిలో ఎవరో ఒకరు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ నిన్న జరిగిన ఆటలో రాంప్రసాద్ వర్షిని ఎక్కువ స్టార్స్ సొంతం చేసుకొని గోటుగా మారారు ఇక ఎలిమినేషన్ నుండి ఇద్దరు సేఫ్ జోన్ లోకి వచ్చేసారు చివరిలో ఉన్నది రామకృష్ణ శివ.. ఇక చివరి వరకు ఓటింగ్ లో మార్పులు జరిగితే శివ సేఫ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు చూడాలి.

- Advertisement -
Advertisement

also read:Cult Movie Review: విశ్వక్ సేన్ ఊహించని ప్రయోగం.. సినిమా హిట్టా ఫట్టా?

ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

బిగ్ బాస్ సీజన్ ప్రారంభమై ఇప్పటికి 50 రోజులు పూర్తి అయింది. ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. మరో 8 వారాలపాటు ఈ రియాలిటీ షో నడుస్తుంది.. టాప్ ఫైవ్లో ఐదుగురు మాత్రమే వెళ్లే అవకాశం ఉంటుంది.ఈ లెక్కన చూస్తే 8 వారాలలో పది మంది హౌస్ నుంచి ఎలిమినేట్ చేయవలసి ఉంటుంది. దీంతో బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనే విషయం చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you