Friday, October 30, 2026
HomeINTERVIEWSRadhika Apte:బోల్డ్ సీన్స్ పై రాధిక ఆప్టే బయట పెట్టిన నిజాలు..!

Radhika Apte:బోల్డ్ సీన్స్ పై రాధిక ఆప్టే బయట పెట్టిన నిజాలు..!

Radhika Apte: బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే తాజాగా బోల్డ్ సన్నివేశాలపై చేసిన కామెంట్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Radhika Apte:బాలీవుడ్లో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ, అవసరమైతే బోల్డ్ పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధంగా ఉండే కొంతమంది సెలబ్రిటీలలో బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే కూడా ముందు వరుసలో ఉంటారు. ఎప్పుడూ కూడా ప్రేక్షకులను సరికొత్తగా ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది రాధిక ఆప్టే. అంతేకాకుండా తాను ఎలాంటి విషయాన్ని అయినా సరే మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడగలిగే హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అందుకే నిరంతరం ఈమె గురించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది.

లో దుస్తులు లేకుండా షర్ట్ బటన్ విప్పి మరి నటించమన్నారు..

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఆప్టే.. తాను గతంలో నటించిన ఒక యాక్షన్ సినిమా షూటింగ్లో ఎదురైన ఒక దారుణమైన పరిస్థితి గురించి తెలిపారు. రాధిక ఆప్టే మాట్లాడుతూ.. గతంలో ఒక సినిమాలో చేస్తున్న సమయంలో లో దుస్తులతోనే స్టంట్స్ చేయాలంటూ మేకర్స్ తనని చాలా ఇబ్బంది పెట్టారని తెలియజేసింది.. షూటింగ్ మొదలయ్యాక నన్ను లోపల బ్రా లేకుండా కేవలం షర్టు మాత్రమే వేసుకొని మరీ బటన్లు విప్పేసి యాక్షన్ సీన్స్ చేయాలంటూ చెప్పారని అసలు ఫిజిక్స్ పరంగా అది సాధ్యమయ్యే పనేనా అంటూ తాను అడిగానని, ఇలాంటివి ఏదైనా ఉంటే ముందే చెప్పాలి తీరా సినిమా షూటింగ్ సెట్లోకి వచ్చాక ఆ సీన్ కి రెండు గంటల ముందు అడగడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించిందని తెలిపింది.

- Advertisement -
Advertisement

మండిపడ్డ రాధిక ఆప్టే..

అంతేకాకుండా ఎక్స్పోజింగ్ చేయాలి అంటూ.. ఆ పార్ట్ చూపిస్తారా? ఈ పార్ట్ చూపిస్తారా? అంటూ రెండు వారాల పాటు నన్ను విపరీతంగా టార్చర్ చేశారంటూ రాధిక ఆప్టే(Radhika Apte) ఎమోషనల్ గా మాట్లాడింది. బోల్డ్ సీన్స్ చేస్తున్న సమయంలో నటీనటులకు రక్షణగా ఉండే కోఆర్డినేటర్లు కూడా నిర్మాత చేతులలో కీలుబొమ్మలుగా మారారని తెలియజేసింది. ఎవరైనా హీరోయిన్లు తరఫున మాట్లాడితే.. వాళ్ళని ఏకంగా ఉద్యోగాల నుంచే తొలగేస్తున్నారంటూ రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

also read:Bigg Boss 10:ఈవారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఎలిమినేట్ తప్పదా..?

- Advertisement -
Advertisement

ఇండస్ట్రీలో అందరూ అలా ఉండరు..

కానీ ఇండస్ట్రీలో అందరూ ఇలా ఉండరని పదిమందిలో ఒకరు ఇద్దరు ఇలాంటి పనులు చేస్తూ ఉండడం వల్ల ఈ సమస్యలు హీరోయిన్లను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపింది రాధిక ఆప్టే. ఈ చేదు అనుభవాన్ని ఇచ్చిన సినిమా పేరు మాత్రం ఆమె చెప్పడానికి మక్కువ చూపలేదు. ఏది ఏమైనా ఇలాంటి సీన్స్ చేయమని ఒత్తిడి చేయడం వల్ల హీరోయిన్స్ ఇబ్బంది పడుతున్నారని మొహమాటం లేకుండా చెప్పేసింది రాధిక ఆప్టే. దీంతో అభిమానులు కూడా ఆమె నటించిన సినిమాల విషయాలకు సంబంధించి తెగ వెతికేస్తున్నారు.

also read:Killer Movie Review:ఏలియన్, ఏఐ, సైన్స్ ఫిక్షన్.. కిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

- Advertisement -
Advertisement

రాధిక ఆప్టే తెలుగు చిత్రాలు..

రాధిక ఆప్టే తెలుగు సినిమాల విషయానికి వస్తే.. రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, ధోని, లెజెండ్, లయన్ వంటి చిత్రాలలో మాత్రమే నటించింది. ఈ చిత్రాలతో భారీ పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ తెలుగు సినిమాలలో కనిపించలేదు. 2026లో లస్ట్ స్టోరీస్ 3 లో నటించింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you