Adivi Sesh:టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నారు. ఆయన నటించిన సినిమాలు విడుదల కావడానికి కొంత సమయం పట్టినా, ప్రేక్షకుల్లో మాత్రం మంచి ఆసక్తిని కలిగిస్తుంటాయి. ప్రస్తుతం అడివి శేష్ తన ప్రతిష్టాత్మక చిత్రం ‘గూఢచారి 2’ పనులతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన పాల్గొన్న ఓ టాక్ షో ప్రోమో సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2లో అడివి శేష్ :
ప్రముఖ నటుడు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమం రెండో సీజన్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కొత్త ప్రోమోను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఇందులో అడివి శేష్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు, అడివి శేష్ మధ్య జరిగిన సంభాషణలు నవ్వులు పూయిస్తున్నాయి.
నిన్ను టెర్రరిస్టును చేయబోతున్నా.. జగపతిబాబు కామెంట్స్:
విడుదలైన ప్రోమోలో జగపతిబాబు, అడివి శేష్(Adivi Sesh) మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా జగపతిబాబు నవ్వుతూ.. ‘‘ఇప్పుడు నిన్ను నేను ఒక టెర్రరిస్టును చేయబోతున్నాను’’ అంటూ శేష్‌తో అన్నారు. దీనికి వెంటనే స్పందించిన అడివి శేష్.. ‘‘సర్, అసలుకే మీరంటే నాకు చాలా భయం’’ అంటూ సరదాగా సమాధానమిచ్చారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. వెంటనే జగపతిబాబు మాట్లాడుతూ.. ‘‘నువ్వు మామూలు యాక్టర్ కాదు.. చాలా పెద్ద యాక్టర్‌వి’’ అంటూ శేష్ నటనను ప్రశంసించారు. వీరిద్దరి మధ్య సాగిన ఈ ఆసక్తికరమైన సంభాషణ ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ ప్రోమో సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ALSO READ:OTT:నవంబర్ 27న ఓటీటీలోకి రాబోతున్న 6 సినిమాలు.. లిస్ట్ ఇదిగో!
మీ రొమాంటిక్ సినిమాలు చూసే ఇన్‌స్పైర్ అయ్యా!:
ఇక మరో సందర్భంలో అడివి శేష్ తన పాత జ్ఞాపకాలకు సంబంధించిన ఓ విషయాన్ని ప్రస్తావించబోయారు. అప్పట్లో ఇండియన్ సీడీలు, క్యాసెట్లు కొనడానికి అమ్మాయిలు వచ్చేవారని ఆయన చెబుతుండగా, జగపతిబాబు వెంటనే స్పందిస్తూ.. ‘‘అప్పటి నుంచే రొమాన్స్ ఉందా?’’ అని సరదాగా ప్రశ్నించారు. దీనికి శేష్ తనదైన శైలిలో సమాధానమిస్తూ.. ‘‘మీ రొమాంటిక్ సినిమాలు చూసే ఇన్‌స్పైర్ అయ్యాను’’ అని చెప్పారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి.
ALSO READ:Poonam Kaur:త్రివిక్రమ్ పై పూనమ్ మరో షాకింగ్ పోస్ట్.. ఆ హీరోయిన్ కి సపోర్ట్ చేస్తూ..!
ప్రోమోలో వెన్నెల కిషోర్ సందడి:
ఈ కార్యక్రమంలో కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఓ వీడియో ద్వారా సందడి చేశారు. అలాగే దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సైతం ఈ ఎపిసోడ్‌లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొత్తానికి అడివి శేష్, జగపతిబాబు మధ్య జరిగిన సరదా సంభాషణలు, ఆసక్తికరమైన ప్రశ్నలు ఈ ఎపిసోడ్‌పై అంచనాలను పెంచుతున్నాయి.




