Tuesday, August 25, 2026
HomeLATESTLenin:'లెనిన్' మూవీ రివ్యూ: అఖిల్ 2.0 మాస్ షో..కెరీర్‌కు ఎట్టకేలకు తొలి హిట్..చించిపడేశాడు రా సామీ..!

Lenin:’లెనిన్’ మూవీ రివ్యూ: అఖిల్ 2.0 మాస్ షో..కెరీర్‌కు ఎట్టకేలకు తొలి హిట్..చించిపడేశాడు రా సామీ..!

Lenin:అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమా ఎలా ఉంది? కథ, నటీనటుల ప్రదర్శన, దర్శకత్వం, సంగీతం, ప్లస్-మైనస్ పాయింట్లు, ప్రేక్షకుల స్పందనతో పాటు పూర్తి మూవీ రివ్యూ మరియు రేటింగ్‌ను చదవండి.

on
- Advertisement -banner Ad

Lenin:అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం ‘లెనిన్’ నేడు థియేటర్లలో విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అక్కినేని అఖిల్ ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించినప్పటికీ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు. అందుకే ఈ సినిమాపై మాత్రం మంచి పట్టుదలతో, కసితో, కృషితో నటించడంతో పాటు ప్రమోషన్స్ కూడా విస్తృతంగా చేశారు. అనుకున్నట్లుగానే ఫైనల్‌గా సినిమా సూపర్ సక్సెస్ అయింది.

అఖిల్(Akhil Akkineni) హీరోగా, భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మంచి హిట్ టాక్‌ను సంపాదించుకుంది. పూర్తిగా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ ఎమోషనల్ డ్రామా ఇది అంటూ ప్రేక్షకులు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను కలిపి కమర్షియల్ టచ్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

- Advertisement -
Advertisement

అఖిల్‌కు ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా అఖిల్‌కు మంచి హిట్ ఇచ్చింది. అఖిల్ కోరుకున్నట్లే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్‌లు ఏంటి? అఖిల్‌కు ఈ సినిమా ఏ విధంగా హిట్ టాక్ తెచ్చిపెట్టింది? కథ ఏంటి? భాగ్యశ్రీ బోర్సే ఎలా నటించింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

also read:I Nobody Movie Review: పృథ్వీరాజ్ సుకుమార్ థ్రిల్లర్ ఎలా ఉంది?

- Advertisement -
Advertisement

కథ:

ప్రాణంగా నమ్మిన స్నేహితుడు చేసిన కుట్రకు హీరో ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే ‘లెనిన్’ కథ. ప్రజలకు అండగా నిలిచే ధైర్యవంతుడైన యువకుడు లెనిన్ (అఖిల్ అక్కినేని). గ్రామంలో జరిగే అన్యాయాలు, రాజకీయ ఆధిపత్యం, కుటుంబ బంధాలు, ప్రేమ, ప్రతీకారం వంటి అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. ఒక కీలక సంఘటన తర్వాత లెనిన్ తన కుటుంబాన్ని, గ్రామాన్ని కాపాడేందుకు చేసే పోరాటమే సినిమా ప్రధాన కథాంశం. ఈ ప్రయాణంలో ఎన్నో భావోద్వేగాలు, యాక్షన్ ఎపిసోడ్లు, ఊహించని ట్విస్టులు వస్తాయి.

also read:Bigg Boss: బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన్న జబర్దస్త్ బ్యూటీ!

- Advertisement -
Advertisement

సినిమా ఎలా ఉంది:

‘లెనిన్’ (Lenin)మొదటి నుంచే గ్రామీణ వాతావరణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ సాగుతుంది. అక్కడి నుంచే కథ ప్రారంభమవుతుంది. ప్రారంభంలో వినిపించే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సినిమాకు మంచి పాజిటివ్ ఫీలింగ్ తీసుకొస్తుంది. కథ నెమ్మదిగా సాగినా, పాత్రల పరిచయం పూర్తయ్యాక ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ ఎపిసోడ్లు కథను మరో స్థాయికి తీసుకెళ్తాయి.రెండో భాగంలో యాక్షన్, భావోద్వేగాలు కలిసి కథను ఇంకా బాగా ముందుకు నడిపిస్తాయి. అయితే కొన్ని సన్నివేశాలు మరింత బలంగా ఉండాల్సిన అవసరం కనిపించింది.

నటీనటుల ప్రదర్శన:

ఈ సినిమాలో అఖిల్ పూర్తిగా కొత్త మాస్ లుక్‌లో కనిపించాడు. దీనిని అఖిల్ 2.0 అని చెప్పాలి. గ్రామీణ యువకుడి పాత్రలో అతను చూపించిన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాల్లో ఎనర్జీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే కీలక సన్నివేశాల్లో అఖిల్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది.

ఇక భాగ్యశ్రీ బోర్సే తన పాత్రకు తగ్గట్టుగా చక్కటి నటన కనబరిచింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సహజంగా అనిపిస్తుంది. శివాజీ తన పాత్రలో మరోసారి తన అనుభవాన్ని చూపించగా, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు.

టెక్నికల్ వర్క్:

సాంకేతికంగా ‘లెనిన్’ మంచి స్థాయిలో రూపొందింది. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఎమోషనల్ సన్నివేశాలకు అది అదనపు బలం ఇచ్చింది. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సమయంలో సంగీత ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఫైట్ సన్నివేశాల్లో తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వదు. అంత అద్భుతంగా ఉంది. లియాన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ గ్రామీణ ప్రాంతాల అందాలను అద్భుతంగా ఆవిష్కరించింది. ప్రతి ఫ్రేమ్ సహజత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు రిచ్ విజువల్స్ తీసుకొచ్చింది. ఎడిటింగ్ కొన్ని చోట్ల మరింత షార్ప్‌గా ఉంటే కథనం ఇంకా వేగంగా సాగేదనే భావన కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్:

*అఖిల్ మాస్ మేకోవర్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్
*తమన్ పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
*ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ ట్విస్టులు
*గ్రామీణ నేపథ్యాన్ని బాగా చూపించిన విజువల్స్
*యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:

*మొదటి భాగంలో నెమ్మదిగా సాగే కథనం
*కొన్ని సన్నివేశాల్లో ఫార్ములా ట్రీట్‌మెంట్
*లవ్ ట్రాక్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడం
*భావోద్వేగాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది

ఫైనల్ పంచ్ లైన్:

‘లెనిన్’ పూర్తిస్థాయి కమర్షియల్ రూరల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో కొన్ని బలహీనతలు, నెమ్మదిగా సాగే భాగాలు ఉన్నప్పటికీ అఖిల్ మాస్ అవతారం, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భాగ్యశ్రీ అందాలు, యాక్షన్ బ్లాక్స్ సినిమాను నిలబెడతాయి.

కొత్త తరహాలో అఖిల్‌ను చూడాలనుకునే అభిమానులకు ఈ సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది. బలమైన కథ కంటే మాస్ ఎలివేషన్స్, యాక్షన్, గ్రామీణ నేపథ్యంలో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను ఆస్వాదించాలనుకునే వారికి ఒకసారి చూడదగ్గ చిత్రం అని చెప్పవచ్చు.

రేటింగ్: 3/5

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you