Tuesday, August 25, 2026
HomeLATESTBigg Boss: బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన్న జబర్దస్త్ బ్యూటీ!

Bigg Boss: బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన్న జబర్దస్త్ బ్యూటీ!

Bigg Boss: బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ 10 లోకి జబర్దస్త్ బ్యూటీకి అవకాశం రాగా ఆమె రిజెక్ట్ చేసినట్లు సమాచారం..

on
- Advertisement -banner Ad

Bigg Boss: బిగ్ బాస్ అనేది ఇప్పుడు చాలా భాషలలో చాలా ప్రాంతాలలో కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షో ఎంతోమందిని సెలబ్రిటీలను చేసింది. ఇందులో సామాన్యులు కూడా పాల్గొనేందుకు ఈ మధ్యకాలంలో తరచూ అవకాశాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss)సందడి మళ్ళీ మొదలు కాబోతోంది. ఇప్పటివరకు తెలుగులో 9 సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో త్వరలోనే పదో సీజన్ కి ముస్తాబు కాబోతోంది. కంటెస్టెంట్ల ఎంపికలు, సరికొత్త స్ట్రాటజీలను అమలు చేస్తూనే, అలాగే గేమ్స్, టాస్క్ ల నిర్వహణలో భాగంగా సరికొత్త పద్ధతులను అమలు చేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ టెన్ లోకి వెళ్ళేది వీరేనా?

అలాగే బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 తో త్వరలోనే ఆడిషన్స్ కూడా మొదలు కాబోతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలోని బిగ్బాస్ 10 వ సీజన్ ప్రారంభం కాబోతోంది. మరొకవైపు ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల పేరు విషయానికి వస్తే.. ఎక్స్ప్రెస్ హరి, నూకరాజు, జ్యోతి, పల్లవి గౌడ, తేజస్విని గౌడ, నందు, రాకింగ్ రాకేష్, చంద్రహాస్, పవిత్ర, వర్షిణి వంటి వారు హౌస్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Shobhan Babu:నటుడు శోభన్ బాబు ఇంట విషాదం?

బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన జబర్దస్త్ బ్యూటీ..

అయితే బిగ్ బాస్ నిర్వాహకులు జబర్దస్త్ కమెడియన్ సత్యశ్రీ ని సంప్రదించగా నో చెప్పిందట. ఇటీవలే ఒక తాజా ఇంటర్వ్యూలో వెంకట్రామయ్య మనవరాలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సత్య శ్రీ (Satya Sri) మాట్లాడుతూ.. బిగ్ బాస్ పైన మీ అభిప్రాయం ఏంటి అని అడగగా.. అందుకు నవ్వుతూ బిగ్ బాస్ ఒక మంచి షో అంటూ తెలియజేసింది. గత రెండు మూడు సీజన్ల నుంచి తనకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సీజన్ కోసం కూడా కాల్ వచ్చింది . అది కూడా భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా.. ఈ షో కి వెళ్లడం పట్ల నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదంటూ తెలిపింది.

- Advertisement -
Advertisement

also read:Payal Rajput:ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ!

అందుకే వెళ్లలేదంటూ?

ఇప్పుడు నా కుటుంబానికి, నాకు.. వెంకట్రామయ్యగారి మనవరాలు చిత్ర బృందం రిలేటివ్ అవుతారని తెలిపింది. తల్లిదండ్రులు కూడా మా కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వారు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను వారిని మేము చూసుకుంటాము అలాగే మా సిస్టర్ కూడా జాబ్ చేస్తోంది. తల్లిదండ్రుల కోసం ఒక ఇల్లు కట్టించాను. అది కూడా తమ సొంత ఊరులోని కట్టించామని.. వారు చివరి వరకు హ్యాపీగా ఉండాలనేదే నా కోరిక అని తెలియజేసింది. అంతేకాకుండా తల్లిదండ్రులను వదిలి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లలేను, వారిని చూసుకొనే బాధ్యత నాకు ఉంది. అందుకే వాళ్ళని వదిలేసి వెళ్లడం కష్టంగా అనిపిస్తోందని తెలియజేసింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you