Tuesday, August 25, 2026
HomeLATESTOTT Movie: గుమ్మడికాయ వెనుక దాగిన భయంకర రహస్యం..హారర్ అభిమానులను వణికిస్తున్న ఓటీటీ థ్రిల్లర్!

OTT Movie: గుమ్మడికాయ వెనుక దాగిన భయంకర రహస్యం..హారర్ అభిమానులను వణికిస్తున్న ఓటీటీ థ్రిల్లర్!

OTT Movie:హారర్ కథల రచయిత ఆర్.ఎల్. స్టైన్ రూపొందించిన Pumpkinhead ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ, నటీనటులు, హారర్ ఎలిమెంట్స్, OTT విడుదల వివరాలను తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

OTT Movie:రొమాంటిక్, లవ్, ఎమోషన్, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ మూవీస్.. వీటిలో ఏ జానర్ సినిమాలను ఎక్కువగా చూస్తారు అంటే నూటికి 90 శాతం మంది హారర్ సినిమాలనే ఇష్టపడుతుంటారు. హారర్ సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో పాటు నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని కూడా పెంచేస్తాయి. ఆ కారణంగానే చాలా మందికి హారర్ సినిమాలు నచ్చుతూ ఉంటాయి. అది ఏ భాష సినిమా అయినా సరే, కచ్చితంగా ఓటీటీలోకి వస్తే చూసేస్తూ ఉంటారు.

భయం పుట్టించే కథలను చూసేందుకు ఆసక్తిగా ఉన్న వాళ్లకు ఇది వెరీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హారర్ సినిమాలంటే ఇష్టం ఉండి, భయం పుట్టించే కథలను చూసేందుకు రెడీగా ఉన్నవాళ్లు ఈ సినిమాను కచ్చితంగా చూడొచ్చు. ఆధ్యంతం ఉత్కంఠభరితమైన సీన్స్, మరపులతో సాగే ఒక థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. ఆ సినిమా ఏంటి? ఆ సినిమాలోని ప్లస్ పాయింట్స్ ఏంటి? ఆ సినిమా కథ ఏంటనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

- Advertisement -
Advertisement

ఓటీటీలో సందడి చేస్తున్న ఫాంటసీ హారర్ మూవీ:

ఒక నవల ఆధారంగా తెరకెక్కించిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ “R. L. Stine పంప్కిన్‌హెడ్”. గత ఏడాది అక్టోబర్ నెలలో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఇప్పుడు మాత్రం మరో ఓటీటీలో(OTT Movie) సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు తాజాగా జియో హాట్‌స్టార్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందులోని ట్విస్టులు, సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. వింత రాక్షసులు, అడ్వెంచర్ కథలను ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ మూవీ అని చెప్పవచ్చు.

also read:Lenin:’లెనిన్’ మూవీ రివ్యూ: అఖిల్ 2.0 మాస్ షో..కెరీర్‌కు ఎట్టకేలకు తొలి హిట్..చించిపడేశాడు రా సామీ..!

- Advertisement -
Advertisement

కథ విషయానికి వస్తే..

తండ్రి అకాల మరణం తర్వాత శ్యామ్, బీన్ రీడ్ తన తల్లి, అన్నయ్య నిక్‌తో కలిసి ఒక కొత్త ఊరికి వెళ్లిపోతాడు. అక్కడ కొత్త వాతావరణంలో ఒంటరితనంతో బాధపడుతూ కాస్త అల్లరి చేయడం ప్రారంభిస్తాడు. లైఫ్‌లో ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నట్లు కనిపించిన ఈ క్రమంలో, ఆ ఊరిలో అందరూ ఎంతో రహస్యంగా, పవిత్రంగా భావించే ఒక గుమ్మడికాయను దొంగిలిస్తాడు. అప్పుడే అసలైన ట్విస్ట్ ప్రారంభమవుతుంది. తమ్ముడు చేసిన తప్పు తెలుసుకున్న అన్నయ్య దానిని తిరిగి ఇవ్వడానికి వెళ్తాడు. కానీ అక్కడ అదృశ్యమవుతాడు. అప్పటి నుంచి అసలు సినిమా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సినిమా ఏ విధంగా వెళ్తుందంటే గూస్‌బంప్స్ రావడం పక్కా. నిక్ అనే అబ్బాయి ఉన్నట్లు అసలు ఆ ఊర్లో ఎవరికీ గుర్తుండదు. కానీ తన అన్నయ్య అదృశ్యమైన తర్వాత ఒక భయంకరమైన శాపం ఉందని తెలుసుకోవడానికి శ్యామ్ బాగా ప్రయత్నిస్తాడు. అందుకోసం క్రూరమైన దిష్టిబొమ్మ రాక్షసులతో పోరాటం కూడా చేయడానికి సిద్ధపడతాడు.

ఆ తర్వాత శ్యామ్ జీవితం ఎలా మారింది? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అసలు నిక్ ఎలా అదృశ్యమయ్యాడు? ఆ గుమ్మడికాయ రహస్యం ఏంటి? గుమ్మడికాయను దొంగిలించడం వల్ల ఆ ఊరికి ఏం జరిగింది? గుమ్మడికాయలో ఉన్న సీక్రెట్ ఏంటి? నిక్ తిరిగి వచ్చాడా లేదా? అన్నదే అసలైన కథ.

- Advertisement -
Advertisement

also read:I Nobody Movie Review: పృథ్వీరాజ్ సుకుమార్ థ్రిల్లర్ ఎలా ఉంది?

ఎందుకు చూడాలంటే?

ప్రతి క్షణం ఎంతో ఉత్కంఠభరితంగా సాగే సీన్స్‌తో ఈ సినిమాను దర్శకుడు చాలా చక్కగా డిజైన్ చేశారు. అక్టోబర్ నెలలో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోకపోయినా, ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చి మాత్రం దుమ్ము దులిపేస్తోంది. ప్రతి హారర్ మూవీ ప్రేక్షకుడు ఈ సినిమాను చూసి థ్రిల్ అవడం ఖాయం. అంత చక్కగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాపై సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్లు ఖచ్చితంగా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you