Wednesday, July 22, 2026
HomeMOVIE NEWSSreemukhi:పెళ్లిపై శ్రీముఖి క్లారిటీ.. అప్పుడే పెళ్ళంట!

Sreemukhi:పెళ్లిపై శ్రీముఖి క్లారిటీ.. అప్పుడే పెళ్ళంట!

Sreemukhi: ప్రముఖ యాంకర్ శ్రీముఖి తాజాగా సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమాలో ఆమెకు తోడికోడలుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

on
- Advertisement -banner Ad

Sreemukhi:సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ హాట్ టాపికే.. పెళ్లి కాని వారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని.. పెళ్లయిన వారు ఎప్పుడు తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతారని ఎదురుచూసే అభిమానులు చాలామంది ఉంటారు. అందుకే సెలబ్రిటీలు వైవాహిక బంధం లోకి అడుగు పెట్టేవరకు శుభవార్త కోసం సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.

అలా సెలబ్రిటీలు ఎప్పుడైనా తమ పెళ్లి గురించి ప్రస్తావించారంటే చాలు ఇక ఆ వార్తలు సోషల్ మీడియాలో దావాణంలా పాకిపోతాయి. ఈ నేపథ్యంలోనే చలాకీతనంతో, అద్భుతమైన వాక్చాతుర్యంతో నటిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్న శ్రీముఖి(Sreemukhi) ఎప్పుడు వివాహం చేసుకుంటుందా? అని ఎంతోమంది ఎదురు చూశారు. అయితే తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె పెళ్లి గురించి ఇచ్చిన క్లారిటీ అందరిలో అంచనాలు పెంచేసింది..

- Advertisement -
Advertisement

సమంత తోడికోడలిగా శ్రీముఖి..

పటాస్ షో ద్వారా యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె.. అదుర్స్ షోతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఒక్కో మెట్టు ఎదుగుతూ పలు షోలతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. మధ్యలో సినిమాలలో కూడా నటిస్తూ అలరిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఏకంగా స్టార్ హీరోయిన్ సమంత ( Samantha)నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమాలో సమంత తోడికోడలిగా అవకాశాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది.

పెళ్లిపై శ్రీముఖి క్లారిటీ..

ఇకపోతే ఈ సినిమా జూన్ 19వ తేదీన థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో జూన్ 15వ తేదీన హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టుచీరలో సాంప్రదాయంగా హాజరయ్యి అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా తన పెళ్లిపై స్పందించింది. ఇకపోతే ఈవెంట్ కి హాజరైన శ్రీముఖిని యాంకర్ సుమ తన ప్రశ్నలతో చిక్కుల్లో పడేసింది. అందులో భాగంగానే స్ట్రైట్ గా ప్రశ్న అడగకుండా ముందుగా బంగారం ఎప్పుడు కొంటారంటూ శ్రీముఖిని ప్రశ్నించింది. ఆమె బదులిస్తూ పెళ్లిళ్ల సమయంలో అని చెబితే మరి నీ పెళ్ళెప్పుడు అంటూ సుమ మరో ప్రశ్న వేసింది .

- Advertisement -
Advertisement

also read:Samantha :ఒత్తిడి పెరిగింది.. దానికి బానిసయ్యాను.. నిజాలు బయటపెట్టిన సమంత!

శ్రీముఖి ఏమాత్రం తడబడకుండా మాట్లాడుతూ.. సమంతను చూస్తూ.. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు సమంత పెళ్లి జరిగింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక నా పెళ్లి కూడా జరిగిపోవాలని అనుకుంటున్నాను .. అంటూ శ్రీముఖి తన పెళ్లిపై నవ్వుతూ కామెంట్లు చేసింది. ఇక మొత్తానికి అయితే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది అని ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you