Vishnupriya:ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ విష్ణు ప్రియ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈమె ఎంత నిజాయితీగా , నిక్కచ్చితంగా ఉంటుందో మనకు బిగ్ బాస్ హౌస్ లోనే తెలిసిపోయింది. తోటి కంటెస్టెంట్ ప్రముఖ సీరియల్ నటుడు పృథ్వీరాజ్ శెట్టి.. తనను ఇష్టపడకపోయినా తన ఇష్టాన్ని అతనిపై చూపిస్తూ వన్ సైడ్ లవర్ గానే అందరి దృష్టిని ఆకట్టుకుంది. మరొకవైపు సినిమాలు చేస్తూ అటు ఆల్బమ్ సాంగ్స్ తో సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఇంస్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ పేరిట ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. రూ.399 రూపాయలు నెలకు కట్టి తన తన విందును చూడవచ్చు అంటూ ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చింది.
అర్థ నగ్న ఫోటోలతో విమర్శలు..
ఇంకేముంది ఈమె అందాల ఆరబోతను చూడాలంటే కేవలం రూ 399 నెలకు చెల్లిస్తే చాలు అని ఎంతో మంది యువత తెగ సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. ఇదే సమయంలో ఒక వర్గం ఈమెపై మండిపడింది. ఇలాంటి ఫోటోలు, వీడియోలు సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తాయి అంటూ ఆమెపై విమర్శలు గుప్పించాయి. అంతేకాదు ఈమెపై పోలీస్ కేస్ కూడా నమోదైన విషయం తెలిసిందే. యువతను తప్పుదోవ పట్టించేలా అభ్యంతరకరమైన కంటెంట్, అర్ధనగ్న ఫోటోలు షేర్ చేస్తోంది అంటూ అటు విద్యార్థి సంఘాలు, ఇటు నెటిజన్స్ ఈమెపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విమర్శలు వస్తున్న వేళ ఎదురు కేసు పెట్టిన విష్ణుప్రియ..
ఇకపోతే ఒకవైపు ఈమెపై విమర్శలు వెల్లువెత్తుతుంటే.. దీనికి భిన్నంగా మరొకవైపు తన సబ్స్క్రిప్షన్ కంటెంట్ పై అసభ్యకరమైన వీడియోలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారు అంటూ ప్లే లైక్ ఇన్ కోగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్ పై విష్ణు ప్రియ(Vishnupriya) ఎదురు కేసు పెట్టింది. అలాగే తనపై జరుగుతున్న ఆన్ లైన్ వేధింపులు, క్యారెక్టర్ పై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారంటూ మియాపూర్ పోలీసులను కూడా ఆశ్రయించింది. ఇక అలా ఈ సబ్స్క్రిప్షన్ వివాదం కాస్త సర్దుమణుగుతోంది అనుకునే లోపే.. తాజాగా ఈమె మరో బాంబు పేల్చింది. సబ్స్క్రిప్షన్ తీసుకున్న తన ఫాలోవర్లతో రెండు రోజుల క్రితం ప్రత్యేకంగా ఒక లైవ్ సెషన్ లో మాట్లాడింది.. అందులో నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఏమాత్రం మొహమాటం లేకుండా సమాధానం చెప్పి విమర్శల పాలయ్యింది విష్ణు ప్రియ.
నా బాడీ కౌంట్ 5..
ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ..” తన బాడీ కౌంట్ 5″ అని వెల్లడించింది. అంటే గతంలో తాను ఐదుగురితో రిలేషన్షిప్ లో ఉండి.. వారితో రొమాన్స్ కూడా చేసినట్లు బహిరంగంగా ఒప్పుకుంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను బయటపెట్టడానికి ఏమాత్రం ఒప్పుకోరు. కానీ విష్ణు ప్రియా ఇలా ఓపెన్ గా నిజాలు మాట్లాడడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇలాంటి బహిరంగ ప్రకటనల వల్ల ఎవరికి ఉపయోగం అని నెటిజన్ లు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది డబ్బుల కోసం, పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తారా అంటుంటే.. మరికొంతమంది సమాజంలో అమ్మాయిలకు ఇలాంటి వ్యాఖ్యలు ఎలాంటి సందేశాన్ని ఇస్తాయి? అని ఇంకొంతమంది ప్రశ్నిస్తున్నారు
నిజం ఎప్పటికీ చేదే..
అయితే మరి కొంతమంది మాత్రం విష్ణుప్రియ ఏ విషయాన్ని దాచి పెట్టకుండా నిజాలు మాత్రమే చెప్పింది. నిజం ఎప్పటికీ చేదే అంటూ ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు. నిజాలు దాచిపెట్టి బయటకు హుందాగా కనిపించడం కంటే నిజాలు చెప్పి అందరిలో ఉన్నతంగా బ్రతకడం మేలు అని ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా విష్ణు ప్రియ తాజాగా తన బాడీ కౌంట్ పై చేసిన కామెంట్లు మరోసారి విమర్శలకు తెరలేపాయి అనడంలో సందేహం లేదు.
also read:Sreemukhi:పెళ్లిపై శ్రీముఖి క్లారిటీ.. అప్పుడే పెళ్ళంట!
రివర్స్ కౌంటర్ ఇచ్చిన విష్ణు ప్రియ..
ఇలా సోషల్ మీడియాలో ఈమె పేరు వైరల్ అవుతుంటే విష్ణు ప్రియ మాత్రం తగ్గేదేలే అంటూ మళ్ళీ గట్టి కౌంటర్ ఇచ్చింది. నిజాయితీగా ఉన్నందుకు నేను ఎప్పుడూ బాధపడను అంటూ తన ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చింది . సమాజం తన గురించి ఏం రాసుకున్నా తనకు పర్లేదని తన జీవితం తన ఇష్టం అనే రీతిలో ఆమె కౌంటర్ ఇచ్చింది. ఏది ఏమైనా రోజురోజుకీ ముదురుతున్న ఈ వివాదం మునుమందు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.
View this post on Instagram


