Keerthy Suresh:గడిచిన కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం దక్షిణాది సినీ పరిశ్రమ పైన చేస్తున్న కామెంట్స్ సైతం అటు అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమలో.. పలు చిత్రాలలో నటించి హీరోయిన్గా పేరు సంపాదించి బాలీవుడ్లో అవకాశాలు అందుకున్న తర్వాత దక్షిణాది సినీ పరిశ్రమలో ఉండే కొన్ని సాంప్రదాయాల విషయాల పైన బాలీవుడ్ నటి రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈమె మేనరికం , వివాహాలు , హీరోయిన్ల పాత్ర ఎంపిక విషయం పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు కూడా దారితీసింది.
రాధిక వివాదంపై స్పందించిన కీర్తి సురేష్..
అయితే ఇదంతా కూడా అక్కా వెబ్ సిరీస్ లో భాగంగా రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలు, అయితే ఆమె పక్కనే ఉన్న మరొక హీరోయిన్ కీర్తి సురేష్ నవ్వుతూ స్పందించడం మరింత వివాదానికి కారణం అయింది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ కూడా దక్షిణాది సాంప్రదాయాలను సమర్ధించారంటూ పలువురు విమర్శలు కూడా చేశారు. తాజాగా ఈ అంశం పైన కీర్తి సురేష్ నేరుగా స్పందించి తన అభిప్రాయాలను తెలియజేశారు. గతంలో తెలుగు సినిమాలో నటించిన అనుభవాలను గుర్తుచేసుకున్న రాధిక.. తనకు ఎదురైన కొన్ని ఇబ్బందులను మాట్లాడారు. తనకంటే ఎక్కువ వయసున్న హీరోతో రొమాన్స్ చేయాల్సి ఉంటుంది. కథలో భాగంగా మేనమామ పాత్రలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకొనే సన్నివేశంలో నటించడం తనకు అసౌకర్యంగా అనిపించిందని తెలిపింది.
తెరపైకి రాధిక ఆప్టే వివాదం..
కానీ రాధిక ఆప్టే తాను ఏ సినిమాలో నటించానని చెప్పకపోయినా.. ఆమె బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రాన్ని ఉద్దేశించే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందంటూ పలువురు నెటిజన్స్ వెల్లడించారు. అయితే ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నిర్మాతలు సైతం ఆమె వ్యాఖ్యలను అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ వివాదం కొనసాగితున్న సమయంలో కీర్తి సురేష్ నటించిన సత్యవాన్ సావిత్రి అనే సినిమా ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ కు ఈ అంశం పైన ప్రశ్న ఎదురయింది.
also read:Anil Ravipudi:జనవరి 12 విడుదల ప్రమోషన్.. కీర్తి సురేష్ తో కృతి శెట్టి డాన్స్..!
ఆ మాటలు తనకు అర్థం కాలేదు అంటూ క్లారిటీ..
ఈ విషయం పైన కీర్తి సురేష్(Keerthy Suresh) మాట్లాడుతూ.. రాధిక ఆప్టే మాట్లాడిన సమయంలో ఆమె వ్యాఖ్యలు వెనుక ఉన్న ఉద్దేశ తనకు మొదట్లో అర్థం కాలేదని తెలియజేసింది. ఆమె దక్షిణాది ప్రాంతంలో ఉన్న మేనరిక వివాహ సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారని అర్థం చేసుకున్నానని వెల్లడించింది.. తాను ఎప్పటికీ దక్షిణాది సాంస్కృతి సాంప్రదాయాల గురించి వాటిని తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం తనకి ఎప్పుడూ లేదని కూడా తెలియజేసింది కీర్తి సురేష్.. ఉత్తరాది వారికి దక్షిణాదిలోని కొన్ని ఆచారాలు పూర్తిగా తెలియకపోవచ్చు వాటిని వివరించడం మాత్రమే చేయగలనని తెలియజేసింది.
also read:Anushka Shetty:హైదరాబాదులో ఇల్లు అమ్మేసిన అనుష్క శెట్టి.. పెళ్లి కోసమేనా..?
సాంప్రదాయాలను విమర్శించను అంటూ కీర్తి సురేష్..
తమిళనాడు తెలుగు రాష్ట్రాలలో మేనరిక వివాహాలు జరిగే సంప్రదాయం ఉందని కేరళలో మాత్రం అలాంటిది లేదని తాను గతంలో కూడా వివరించాను అంటూ కీర్తి సురేష్ తెలిపారు. కర్ణాటకలో ఈ సాంప్రదాయం ఉందో లేదో అనే విషయం కూడా తాను కచ్చితంగా చెప్పలేనని కూడా తెలిపింది. ఈ క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదం సర్దుమణిగినట్లుగా కనిపిస్తుంది. మరి కొంతమంది కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలకు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
#KeerthySuresh Replies to a Question About #RadhikaApte’s Comments on the Murai Maaman Culture:
“I didn’t understand what she meant when she said that she had to marry her uncle in a film. Only later did I realise that she was talking about the culture. With all due respect, I will never let down our culture there sir.. I can only explain it to them because they don’t know about it. I cannot prove to them that this is our culture. I don’t know about Karnataka.. I was just saying it as an information that this culture exists in TamilNadu and Andhra. Kerala doesn’t have this culture..” https://t.co/IbEhGZA0jP
— Laxmi Kanth (@iammoviebuff007) November 18, 2026




