Sunday, August 23, 2026
HomeLATESTOTT:మలయాళం నుంచి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్..!

OTT:మలయాళం నుంచి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్..!

OTT:మలయాళ నటి నిమిషా సజయన్ ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘బబితా సింగ్ రిపోర్టింగ్’ ట్రైలర్ విడుదలైంది.

on
- Advertisement -banner Ad

OTT:మలయాళ విలక్షణ నటి నిమిషా సజయన్ మెయిన్ లీడ్‌గా నటించిన పవర్‌ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా ‘బబితా సింగ్ రిపోర్టింగ్’. ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. యంగ్ పోలీస్ ఆఫీసర్ అవతార్‌లో నిమిషా సజయన్ నటన అద్భుతం. కేస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే సస్పెన్స్ ఎలిమెంట్స్ డిజిటల్ ఆడియన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేశాయి.

ఓటీటీలోకి నేరుగా..:

ఈ క్రైమ్ థ్రిల్లర్ నేరుగా ఓటీటీలోకి(OTT) రాబోతుంది. ఇందులో నిమిషా సజయన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ బబితా సింగ్ పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఆమె పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలవబోతుంది అని చెప్పడంలో సందేహమే లేదు. ఆమె చిన్ననాటి స్నేహితుడు బన్సీ చాలా దారుణంగా హత్యకు గురవడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. తన ప్రాణ స్నేహితుడిని చంపిన హంతకుడిని పట్టుకోవడానికి బబితా సింగ్ పూర్తి దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఆ దర్యాప్తులోనే అనేక ట్విస్టులు, రహస్యాలు బయటపడతాయి. మామూలు మర్డర్ మిస్టరీగా మొదలైన ఈ కేస్ చివరకు వ్యక్తిగత జీవితానికి ప్రమాదకరంగా మారిపోతుంది.

- Advertisement -
Advertisement

also read:Hema:అనసూయ వ్యాఖ్యలపై హేమ ఘాటు కౌంటర్.. అంత మాట అనేసింది ఏంటి?

బబితా సింగ్‌కు ఎదురైన సవాల్ ఏంటి?:

నమ్మిన సొంత మనుషుల నిజస్వరూపాలు బయటపడటంతో ఆమె ఏ నిర్ణయం తీసుకుంది అనేది ఈ సినిమా క్లైమాక్స్. అసలు ప్రాణ స్నేహితుడిని చంపింది ఎవరు? ఆ మరణానికి బబితా సింగ్ పర్సనల్ లైఫ్‌కి కనెక్షన్ ఏంటి? అనేది సినిమా కథ. ఖచ్చితంగా సినిమా వెరేఅ లెవల్ లో ఉండబోతుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

సౌత్ అండ్ నార్త్ ప్రాజెక్టుల్లో ఇంటెన్స్ రోల్స్ చేస్తూ ప్రశంసలు అందుకున్న నిమిషా.. బబితా క్యారెక్టర్‌లో నటించలేదు.. జీవించేసిందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఆమె డైలాగ్ డెలివరీ, ఆమె లుక్స్, ఆమె పర్ఫార్మెన్స్.. అన్నీ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ అవ్వబోతున్నాయి. పోలీస్ డ్యూటీకి, ఫ్రెండ్‌ను కోల్పోయిన పర్సనల్ ఎమోషన్‌కి మధ్య నలిగిపోయి ఆఫీసర్‌గా ఆమె పండించిన హావభావాలు వేరే లెవెల్‌లో ఉండబోతున్నాయని అంటున్నారు మేకర్స్. ట్రైకర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఓ ఇన్వెస్టిఘేషన్ ధ్రిల్లర్ ట్రైల్లర్ ని చూడలేదు అంటున్నారు జనాలు.

also read:Tollywood:చిరంజీవి క్యారెక్టర్ పై బండ్ల గణేష్ అలా.. హైపర్ ఆది ఇలా..!

- Advertisement -
Advertisement

సుదీప్ శర్మ నేతృత్వంలో..:

పాతాళ్ లోక్’, ‘కోహ్రా’ వంటి కల్ట్ ఓటీటీ సిరీస్‌లను అందించిన ప్రముఖ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుదీప్ శర్మ ఈ ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం మర్డర్ మిస్టరీ అనుకుంటే పొరపాటే. ఎమోషనల్‌గా ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ మోస్ట్ అవైటెడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఆగస్టు 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ లవర్స్‌కు ఇది ఒక పర్ఫెక్ట్ డిజిటల్ ట్రీట్‌గా నిలవడం పక్కా అనిపిస్తుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you