Tollywood:నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ రోజుని చిరంజీవి అయినా మరిచిపోతారేమో కానీ, మెగా ఫ్యాన్స్ మాత్రం మర్చిపోరు. అంత ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నేడు మెగా అభిమానులు పలుచోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదానాలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవికి స్పెషల్‌గా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. కాగా, సినీ సెలబ్రిటీస్, ఆయన శ్రేయోభిలాషులు సోషల్ మీడియా(Tollywood)వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మెగాస్టార్‌పై బండ్ల గణేష్ ప్రశంసలు:
మెగా ఫ్యామిలీకి చాలామంది స్టార్ హీరోస్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో టాప్ మోస్ట్‌లో ఉంటాడు బండ్ల గణేష్. బండ్ల గణేష్ మెగా ఫ్యామిలీకి ఏ రేంజ్ భక్తుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే వేడుకల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో బండ్ల గణేష్ తన స్పీచ్‌తో అదరగొట్టేశాడు. ఆయన స్పీచ్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.
“ఏడుకొండల వెంకన్న సాక్షిగా నిజాలే మాట్లాడతా అంటూ మొదలుపెట్టిన బండ్ల గణేష్, చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ఒక్కొక్క విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా, జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పుకొచ్చాడు. 71 సంవత్సరాల నుంచి నిరంతరం ఇండస్ట్రీలో స్టార్‌గా ఉంటూ, తాను ఎదుగుతూ పక్కవాళ్లకు సపోర్ట్ చేస్తున్న ఏకైక హీరో చిరంజీవి అంటూ పొగిడేశారు.అంతేకాదు, ఆయన తన కుటుంబం పట్ల ఎలా ఉంటారు, ప్రజల పట్ల ఎలా ఉంటారు అనే విషయాలను చాలా చాలా చక్కగా వివరించారు. ఈ మధ్య ఒకసారి ఆయనను కలవడానికి వెళ్లినప్పుడు జరిగిన సంభాషణ గురించి కూడా చెప్పుకొచ్చారు”.
also read:Chiranjeevi:చిరంజీవి బర్త్డే స్పెషల్ టీవీ మూవీస్..!
చిరంజీవి ఎవరినీ తొక్కరు.. ఎక్కిస్తారు:
అంతేకాదు, సోషల్ మీడియాలో చాలామంది చిరంజీవిపై ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. చిరంజీవి గారు ఇతరులను తొక్కేశారు అని మాట్లాడుతూ ఉంటారు. అదంతా తప్పు అంటూ బండ్ల గణేష్ వివరించారు. చిరంజీవి ఎవరినీ తొక్కరు.. ఎక్కిస్తారు, లేపుతారు, తీసుకెళ్లి సీట్లో కూర్చోపెడతారు. అది ఆయన క్యారెక్టర్. ఎవరికి టాలెంట్ ఉన్నా సరే ఆయన ఎంకరేజ్ చేస్తారు. శక్తి, నిజాయితీ ఉంటే మనవాళ్లా, పక్కవాళ్లా అని చూడరు. పూర్తి సహకారం అందిస్తారు. దానికి బిగ్ ఎగ్జాంపుల్ నేనే. నాలాంటి సామాన్యుడు ఇప్పుడు ఇంత స్టార్‌గా మారడానికి కారణం చిరంజీవి గారే. నేను వెళ్లి ‘అన్నయ్య, నా ఇంట్లో ఇది ఉంది’ అని చెప్పగానే వెంటనే వచ్చేసేంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది.
also read:Hero Siddharth:స్పెషల్ సాంగ్ లపై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్..!
ఆయన చరిత్రను పాఠ్య పుస్తకాలుగా పెట్టి భావితరాల విద్యార్థులకు చెప్పాలి అంటూ ఎమోషనల్‌గా స్పందించారు. ఆయన గురించి ఎవరు ఏమైనా మాట్లాడుకున్నా, అది అల్ప సందేశమైనా తప్ప, ఆయన మహోన్నత స్థాయికి ఎప్పటికీ మారదు అంటూ చెప్పుకొచ్చారు. చిరంజీవి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా విష్ చేశారు. ఆయన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైపర్ ఆది స్పీచ్ కూడా వైరల్:
ఈ ఈవెంట్‌లో హైపర్ ఆది కూడా పాల్గొన్నారు. హైపర్ ఆది మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మా జనరేషన్ చందమామను చూస్తూ తిన్నామని, చిరంజీవిని చూస్తూ పెరిగామని, పవన్ కళ్యాణ్‌ను చూస్తూ అరిచిందని, రామ్ చరణ్‌ను చూస్తూ గర్వపడుతుందని అంటూ తనదైన స్టైల్‌లో డైలాగ్‌తో అదరగొట్టేశాడు.క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ ని వైభవ్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ధోనీలు దాటేసినట్లే సినిమాలో కూడా రికార్డులు మారుతూ ఉంటాయి. కానీ చిరంజీవి డ్యాన్స్, ఫ్యాన్ బేస్, సహాయగుణం ఎలాంటి మార్పు ఉండదు అంటూ హార్ట్ టచ్ చేసే విధంగా మాట్లాడారు.
నెగిటివ్ ప్రచారంపై ఘాటు కౌంటర్:
అంతేకాదు, గత కొన్ని రోజులుగా చిరంజీవి తొక్కేశాడు, ఎదగనీకుండా ఆపేశాడు అని వినిపిస్తున్న నెగిటివ్ ప్రచారం గురించి ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి దేన్ని తొక్కారో వివరిస్తూ.. ఎవరు నెంబర్ వన్‌గా ఉండలేరు అనే ఇతరుల అహంకారాన్ని తొక్కేశారు. బాలీవుడ్ కలెక్షన్ల భ్రమలను తొక్కేశారు. డ్యాన్స్ అంటే కేవలం నడవడమే అనుకునే ఆలోచనలను తొక్కారు.
కొడుకు సక్సెస్ అవ్వడు అనుకునే భావాలను తొక్కుకుంటూ ఆయన అగ్రపీఠాన కూర్చున్నారని స్పందించాడు. ఎంతమంది ఆయన మీద పడి ఏడ్చినా, అది ఆయన సాయంత్రం సరదాగా వేసుకునే పంచ అంచుని అంచును కూడా కదిలించలేదని అన్నారు. స్పైడర్‌మ్యాన్ సినిమాలో ఐటమ్ సాంగ్ లేదని ఏడ్చినట్లే ఈ నెగెటివిటీ కూడా ఉంటుంది అని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ స్పీచ్ బాగా వైరల్ అవుతోంది.




