HDB chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీలో ఎదిగారనే విషయం అందరికీ తెలిసిందే.ఎంతో మంది సెలబ్రిటీలకు చిరంజీవి ఆదర్శంగా ఉన్నారు. ఈరోజు చిరంజీవి 70వ పుట్టినరోజు(HDB chiranjeevi)సందర్భంగా మెగా అభిమానులు చాలా ప్రాంతాలలో రక్త శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా మరికొంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే సినిమాల అప్డేట్ల కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. తాజాగా చిరంజీవి డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో రాబోతున్న రెండవ చిత్రం మెగా 158. ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు.
మెగా 158 మూవీ టైటిల్ రిలీజ్…
పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ చిత్రానికి కాకా అనే టైటిల్ని ఖరారు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ అభిమానుల సినిమాపై మరింత అంచనాలను పెంచేసేలా చేసింది. ఆక్వా రంగంలోకి సత్య పాత్రతో సూపర్వైజర్ గా చిరంజీవి ఎంట్రీ ఇచ్చినట్లు ఈ వీడియోలో చూపించారు. అలాగే చెన్నై టీం తో ఫోన్లో మాట్లాడుతూ.. సకాలంలో లోడ్ చేరుతుందా అని అడగగా అందుకు భరోసా ఇవ్వడం పండుగ టార్గెట్ పేరుతో సునీల్ అడిగిన లీవ్ ని తిరస్కరించడం వంటి సీన్స్ చూపించారు.
also read:OTT:మలయాళం నుంచి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్..!
ఆకట్టుకుంటున్న గ్లింప్స్..
అంతేకాకుండా గెటప్ శ్రీను స్కూటర్ కీస్ ని విసిరే క్రమంలో అవి అనుకోకుండా నీటిలో పడిపోవడం, చిరంజీవి విజిల్ వేయగానే ఒక రిమోట్ ని తీసుకురావడం ఆ రిమోట్ మాగ్నెట్ సహాయంతో కేసులు బయటకు తీసే క్రమంలో అందులో ఉండే తుపాకులు బయట కనిపించడం వంటివి మరింత ఆసక్తి పెంచేశాయి. చిరంజీవి అద్దాలు ధరించి మధ్య వయసుడైన కే సత్యం రూపంలో చాలా హుందాగా కనిపించారు. ఆ వెంటనే కాకా అనే టైటిల్ ను రివీల్ కావడం అనంతరం ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని సీన్స్ గన్స్ పేలుస్తూ చూపించడం సినిమా పైన మరింత క్యూరియాసిటీని పెంచేశాయి.
also read:Hema:అనసూయ వ్యాఖ్యలపై హేమ ఘాటు కౌంటర్.. అంత మాట అనేసింది ఏంటి?
సంక్రాంతి టార్గెట్..
డైరెక్టర్ బాబి, చిరంజీవి కాంబినేషన్లో గతంలో వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది . తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో అనస్వర రాజన్, చిరంజీవి కూతురు పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే మరో హీరోయిన్ నివేథా పేతురాజ్ కీలకమైన పాత్రలో నటిస్తోంది. జనవరి 13 2027 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా గ్లింప్స్ ద్వారా కూడా ప్రకటించారు. మరి ఈ సినిమా కూడా ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ ని అలరించేలా కనిపిస్తోంది. మిగిలిన సినిమాల అప్డేట్లు కూడా మరికొన్ని రోజులలో వస్తాయేమో చూడాలి మరి.




