Sunday, August 23, 2026
HomeLATESTTollywood anchor:బిగ్ బాస్ 10 లోకి అందాల యాంకరమ్మ..టీవీలకు అతుక్కుపోతారు జనాలు..!

Tollywood anchor:బిగ్ బాస్ 10 లోకి అందాల యాంకరమ్మ..టీవీలకు అతుక్కుపోతారు జనాలు..!

Tollywood anchor:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10షోలోకి ఓ అందాల యాంకర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Tollywood anchor:బిగ్ బాస్.. బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమోగిపోతుంది. త్వరలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎక్కువగా బిగ్ బాస్‌కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. జనాలు కూడా బిగ్ బాస్‌లోకి వెళ్లబోయే కంటెస్టెంట్ల పేర్ల గురించి చర్చించుకుంటున్నారు. ఇక యూట్యూబ్ ఛానల్స్ అయితే బిగ్ బాస్‌లోకి వెళ్లబోయే స్టార్ సెలబ్రిటీస్ వీరే అంటూ రకరకాల థంబ్‌నెయిల్స్ పెట్టి క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.

బిగ్ బాస్ హౌస్‌లోకి టాప్ యాంకర్?

ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేయబోయే స్టార్ సెలబ్రిటీస్‌లో టాలీవుడ్ ఫిమేల్ యాంకర్(Tollywood anchor) కూడా ఉంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. గ్లామర్ డోస్ కోసం టాలీవుడ్ టాప్ మోస్ట్ ఫిమేల్ యాంకర్ వర్షిణిని(anchor varshini) రంగంలోకి దించుతున్నారు అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

- Advertisement -
Advertisement

వర్షిణి ఎవరో అందరికీ తెలిసిందే. ఈటీవీ కోసం మల్లెమాల ప్రొడ్యూస్ చేసిన జబర్దస్త్, అదే విధంగా పటాస్ 2తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. వీటితో పాటు కొన్ని రియాలిటీ షోలకు యాంకరింగ్ కూడా చేశారు వర్షిణి. ఆమె అందాల ఆరబోత గురించి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి అందరికీ బాగా అర్థమవుతుంది. సినిమాల్లో కూడా నటించింది.

also read:HDB chiranjeevi: కాకా టైటిల్ తో అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్!

- Advertisement -
Advertisement

నిజంగానే బిగ్ బాస్‌లోకి వెళ్తుందా?:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో ఆమె కూడా అడుగుపెట్టబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోయింది. వర్షిణి సౌందర్య ఫ్రెండ్స్‌లో చాలా మంది బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు. ఆమెకు ముందు యాంకర్ శ్రీముఖి సైతం బిగ్ బాస్‌కు వెళ్లి రన్నరప్‌గా వచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ అగ్నిపరీక్షకు పోస్ట్ చేస్తున్నారు. జబర్దస్త్‌తో పాపులారిటీ అయినటువంటి ముక్కు అవినాష్, ఇమ్మానుయేల్ కూడా బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశారు. ఇప్పుడు వర్షిణి ఏం చేస్తారో అంటూ జనాలు క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు.

also read:OTT:మలయాళం నుంచి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్..!

- Advertisement -
Advertisement

గ్లామర్ డోస్ పెరగడం ఖాయమేనా?:

నిజంగానే ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగుపెడితే షోలో గ్లామర్ డోస్ మరింత పెరగడం ఖాయమని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లబోతుందనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.

దీంతో నిజంగానే ఆమె కంటెస్టెంట్‌గా కనిపిస్తారా? లేదా ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారమేనా? అనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఆమె ఎంట్రీ ఖరారైతే బిగ్ బాస్ సీజన్ 10పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరగడం ఖాయమని నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you