Sunday, November 15, 2026
HomeINTERVIEWSDil Raju:టాక్సిక్ సినిమాతో నష్టాలు రాలేదు..లాభాలే వచ్చాయి.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

Dil Raju:టాక్సిక్ సినిమాతో నష్టాలు రాలేదు..లాభాలే వచ్చాయి.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

Dil Raju:తాజాగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో ఈ విషయంపై దిల్ రాజును ప్రశ్నించగా ఆసక్తికరంగా స్పందించారు. 'టాక్సిక్' సినిమా వల్ల తాను నష్టపోలేదని స్పష్టం చేశారు.

on
- Advertisement -banner Ad

Dil Raju:సినిమా హిట్ అయితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయి. అదే సినిమా పరాజయం పాలైతే భారీ నష్టాలు తప్పవనే అభిప్రాయం ఇండస్ట్రీలో సాధారణంగా వినిపిస్తుంటుంది. అయితే యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విషయంలో తనకు భారీ నష్టాలు వచ్చాయంటూ జరిగిన ప్రచారంపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు స్పందించారు. ఈ సినిమా వల్ల తనకు ఎలాంటి నష్టం రాలేదని, పైగా కొంత లాభం కూడా వచ్చిందని వెల్లడించారు. తనపై కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

టాక్సిక్ నష్టాల ప్రచారంపై దిల్ రాజు క్లారిటీ :

కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యశ్ హీరోగా నటించిన చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా ఫలితంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజు(Dil Raju) డిస్ట్రిబ్యూట్ చేయడంతో ఆయనకు భారీగా నష్టాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

- Advertisement -
Advertisement

తాజాగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో ఈ విషయంపై దిల్ రాజును ప్రశ్నించగా ఆసక్తికరంగా స్పందించారు. ‘టాక్సిక్’ సినిమా వల్ల తాను నష్టపోలేదని స్పష్టం చేశారు. తనను భారీగా నష్టపోయిన వ్యక్తిగా చిత్రీకరించేందుకు కొందరు సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్స్ చేశారని ఆరోపించారు. ఇలాంటి ప్రచారాలు ఇండస్ట్రీలో ఎక్కువవుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

also read:Chiranjeevi:మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి అరుదైన గుర్తింపు..!

- Advertisement -
Advertisement

డిస్ట్రిబ్యూషన్ కమిషన్‌తోనే లాభాలు:

‘టాక్సిక్’, ‘రామాయణం’ సినిమాల డిస్ట్రిబ్యూషన్ విధానాన్ని కూడా దిల్ రాజు వివరించారు. ఈ రెండు సినిమాలకు తాను కమిషన్ పద్ధతిలోనే డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించినట్లు తెలిపారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తనకు రావాల్సిన కమిషన్ అందిందని పేర్కొన్నారు. అందువల్ల ‘టాక్సిక్’ వల్ల ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని, కొంత లాభం కూడా వచ్చిందని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో తన గురించి ఏం జరుగుతుందో టీమ్ ఎప్పటికప్పుడు తెలియజేస్తుందని, ప్రతి విషయాన్ని గమనించినప్పటికీ వాటిపై స్పందిస్తూ సమయం వృథా చేసుకోనని చెప్పారు.

- Advertisement -
Advertisement

also read:MM keeravani:22 కిలోల బరువు తగ్గిన కీరవాణి.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్..!

రామాయణం, సీన్ విజయాలపై ప్రశంసలు :

ఇదే సందర్భంగా ‘రామాయణం’, ‘సీన్’ సినిమాల విజయాలపై దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు సూర్య నటించిన ‘సీన్’ చిత్రాన్ని కూడా ఆయన ప్రశంసించారు. ప్రతి పది నిమిషాలకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి విజిల్స్ వినిపించాయని, దర్శకుడు జిత్తు మాధవన్ కథ, స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని అన్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you