Tuesday, November 3, 2026
HomeLATESTChiranjeevi:అమిత్ షాను కలిసిన చిరంజీవి-రామ్ చరణ్.. ఎందుకంటే..?

Chiranjeevi:అమిత్ షాను కలిసిన చిరంజీవి-రామ్ చరణ్.. ఎందుకంటే..?

Chiranjeevi: కేంద్రమంత్రి అమిత్ షాను చిరంజీవి ఆయన తనయుడు ప్రముఖ హీరో రామ్ చరణ్ కలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Chiranjeevi:టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత కొద్దిరోజులుగా మెగా ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో పలు రకాల మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి . వీటి మీద ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కినప్పటికీ కూడా ఫలితం లేదు. ఇప్పుడు తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయినట్లు తెలుస్తోంది.

అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్..

నిన్నటి రోజున హైదరాబాద్ పర్యటనలో భాగంగా రామ్ చరణ్, చిరంజీవి (Chiranjeevi)ప్రత్యేకంగా అమిత్ షాను కలిసినట్లు తెలుస్తోంది. ఏఐ దుర్వినియోగం, డీప్ ఫేక్ సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని అమిత్ షాను రిక్వెస్ట్ చేసినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీ ప్రేమికులను లక్ష్యంగా చేసుకొని కొన్ని అసభ్యకరమైన ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలను కూడా రూపొందిస్తున్నారని, ఇప్పుడు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేలా మరో కీలకమైన అడుగు వేశారు.

- Advertisement -
Advertisement

also read:Srinidhi Shetty:సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీనిధి శెట్టి బికినీ వీడియో..!

హామీ ఇచ్చిన కేంద్రమంత్రి..

టెక్నాలజీ దుర్వినియోగం కళాకారుల హక్కులు, గౌరవం వాటికి క్రియేటివ్ కంటెంట్ మరింత ముప్పు గా మారబోతోందని చిరంజీవి సైతం అమిత్ షాకి వివరించారు. ఈ సమస్య కేవలం సోషల్ మీడియా వేదికకే పరిమితం కాదని, సినీ ఇండస్ట్రీ తరుపున చాలామంది వీటి దుర్వినియోగాన్ని అరికట్టేలా ఉండాలని , అందుకు సంబంధించి రక్షణ చర్యలు కూడా చేపట్టాలని కోరారట చిరంజీవి. ఈ విషయం పైన తక్షణమే చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర హోంమంత్రి కూడా హామీ ఇచ్చినట్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Ritika Nayak: 26 ఏళ్లలోకి అడుగుపెట్టిన మిరాయ్ బ్యూటీ .. గ్లామర్ ఫోటోస్ వైరల్!

అసలు విషయం చెప్పిన రాంచరణ్..

అమిత్ షాతో భేటీ వివరాలను సైతం రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఈరోజు మా నాన్న చిరంజీవితో కలిసి గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసామని, ఈ విషయం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఏఐ, డీప్ ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగం పెరుగుతూ ఉండడం పై అలాగే కళాకారులు, సినీ పరిశ్రమ పైన దీని ప్రభావం చాలా చూపిస్తోందని, ఈ విషయం రోజురోజుకి ఆందోళనను కలిగించేలా చేస్తోందని అర్థం చేసుకొని కేంద్ర హోం మంత్రినీ కలిసాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించడం ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిశీలించి ఇలాంటి దుర్వినియోగాలను అరికట్టేందుకు మరిన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. మాకు సమయం కేటాయించి మా ఆందోళనను అర్థం చేసుకొని మాకు మద్దతు తెలిపిన కేంద్రమంత్రికి కృతజ్ఞతలు అంటూ రామ్ చరణ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you