Srinidhi Shetty:‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యశ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రీనా దేశాయ్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో భారీగా అభిమానులను సంపాదించుకుంది. అయితే సినిమాల్లో ఎంతో హుందాగా, పద్ధతిగా కనిపించే ఈ బ్యూటీకి మోడలింగ్ రంగంలోనూ మంచి చరిత్ర ఉంది. తాజాగా ఆమెకు సంబంధించిన పాత బికినీ ఫోటోషూట్‌లు, వీడియో క్లిప్స్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
మోడలింగ్ నుంచి అంతర్జాతీయ గుర్తింపు వరకు.. :
శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) సినీ రంగంలోకి అడుగుపెట్టకముందే మోడలింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందాల పోటీల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకుంది. 2015లో మిస్ కర్ణాటక కిరీటాన్ని సొంతం చేసుకున్న ఆమె.. 2016లో మిస్ దివా సుప్రానేషనల్ టైటిల్‌ను గెలుచుకుంది. అదే ఏడాది జరిగిన మిస్ సుప్రానేషనల్ పోటీల్లో విజేతగా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చింది.
ఈ పోటీల్లో భాగంగా నిర్వహించిన స్విమ్‌సూట్ రౌండ్స్‌కు సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలు అప్పుడప్పుడు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో క్లిప్స్ మళ్లీ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
also read:Ritika Nayak: 26 ఏళ్లలోకి అడుగుపెట్టిన మిరాయ్ బ్యూటీ .. గ్లామర్ ఫోటోస్ వైరల్!
బికినీ లుక్స్‌తో నెటిజన్లలో ఆసక్తి..:
సాధారణంగా శ్రీనిధి శెట్టిని ప్రేక్షకులు కేజీఎఫ్ చిత్రంలోని రీనా పాత్ర ద్వారానే ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమాలో సంప్రదాయబద్ధమైన లుక్స్‌తో కనిపించిన ఆమె.. మోడలింగ్ రోజుల్లో చేసిన ఫోటోషూట్స్‌లో మాత్రం పూర్తిగా భిన్నమైన గ్లామర్ లుక్‌లో కనిపించింది. దీంతో ఆమె పాత వీడియోలు చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా బికినీ, స్విమ్‌సూట్ లుక్స్‌లో ఉన్న వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ అవుతుండటంతో మరోసారి ఆమె అందాల ప్రస్థానంపై చర్చ జరుగుతోంది. అయితే ఇవి కొత్త ఫోటోషూట్స్ కాకుండా మోడలింగ్ కెరీర్‌కు సంబంధించిన పాత విజువల్స్ కావడం గమనార్హం.
also read:King Movie:షారుక్ ఖాన్ బర్తడే.. కింగ్ సినిమా నుంచి రొమాన్స్, యాక్షన్ పాట రిలీజ్!
కేజీఎఫ్‌తో పాన్ ఇండియా గుర్తింపు..:
మోడలింగ్‌లో మంచి పేరు సంపాదించిన శ్రీనిధికి ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ సినిమాతో హీరోయిన్‌గా భారీ గుర్తింపు లభించింది. ఆ తర్వాత ‘కేజీఎఫ్: చాప్టర్ 2’తోనూ ప్రేక్షకులను అలరించింది. అనంతరం తమిళ స్టార్ హీరో విక్రమ్ సరసన ‘కోబ్రా’ సినిమాలో నటించింది. తెలుగులో ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతోనూ ప్రేక్షకులకు దగ్గరైంది. బోలెడు సినిమా ఆఫర్లు వస్తున్న సరే ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే జనాలకి ఈ అమ్మడు అంటే అదో రకమైన ఇష్టం. డైరెక్టర్స్ కూడా ఈమె ని బాగా పొగిడేస్తూ ఉంటారు.
మొత్తానికి సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకుంటూనే, మోడలింగ్ రోజుల నాటి ఫోటోలు, వీడియోలతోనూ శ్రీనిధి శెట్టి సోషల్ మీడియాలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అందుకే ఆమెకు సంబంధించిన పాత గ్లామర్ విజువల్స్ మరోసారి నెటిజన్లలో ఆసక్తిని పెంచుతున్నాయి.
Sanskari Srinidhi Shetty Rare Video Of Bikini 👙 👙
#SrinidhiShetty https://t.co/HZAN3Nc49m— ₵ł₦Ɇ₱ɄⱠ₴Ɇ (@CINEPULSE02) November 2, 2026




